ETV Bharat / sports

ఐర్లాండ్​తో మ్యాచ్​లో భువి అరుదైన రికార్డ్

author img

By

Published : Jun 27, 2022, 12:46 PM IST

Bhuvneshwar Kumar Ireland: ఐర్లాండ్​తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో భారత పేసర్​ భువనేశ్వర్​ రికార్డు సృష్టించాడు. పవర్​ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా ఘనత సాధించాడు.

Bhuvneshwar kumar ireland
Bhuvneshwar kumar ireland

Bhuvneshwar Kumar Ireland: భారత పేసర్​ భువనేశ్వర్​ కుమార్​ అరుదైన రికార్డును సాధించాడు. టీ20 ఫార్మాట్​లో పవర్​ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఐర్లాండ్​తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో ఆ జట్టు కెప్టెన్​ ఆండ్రూ బాల్​బిర్ని వికెట్​ తీసిన భువి ఈ ఘనత సాధించాడు. ఈ వికెట్​తో 33 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న వెస్టిండీస్​ స్పిన్నర్​ శ్యామ్యూల్​ బద్రీ, న్యూజిలాండ్​ పేసర్​ టిమ్​ సౌథీని అధిగమించాడు. 32 ఏళ్ల భువనేశ్వర్​ ఇప్పటివరకు 64 మ్యాచులాడగా.. 64 వికెట్లు తీశాడు. 121 వన్డేల్లో 141 వికెట్లు, 21 టెస్టుల్లో 63 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్​పై వరుణుడు ప్రభావం చూపడం వల్ల 12 ఓవర్లకు కుదించారు. హార్దిక్‌ పాండ్య నేతృత్వంలో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీపక్‌ హుడా (47 నాటౌట్‌; 29 బంతుల్లో 6x4, 2x6), ఇషాన్‌ కిషన్‌ (26; 11 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్‌ పాండ్య (24; 12 బంతుల్లో 1x4, 3x6) చెలరేగడం వల్ల 109 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో యంగ్‌ (2/18) ఒక్కడే ప్రభావం చూపాడు. అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌.. 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భువనేశ్వర్‌ కుమార్‌ (3-1-16-1), చాహల్‌ (3-0-11-1) ప్రత్యర్థిని కట్టడి చేశారు. సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మంగళవారం జరగనుంది.

ఇదీ చదవండి: 'స్టార్ ఆటగాళ్లు లేకపోతేనేం.. ఈ కోచ్​ ఉన్నాడుగా.. ఛాంపియన్లను చేయడానికి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.