ETV Bharat / entertainment

​హరీశ్​శంకర్​తో సినిమా.. బన్నీ-రామ్​.. చేసేదెవరు?

author img

By

Published : Jun 27, 2022, 5:18 PM IST

Rampotineni Harishshankar movie: దర్శకుడు హరీశ్​ శంకర్.. హీరో అల్లుఅర్జున్​తో ఓ సినిమా చేయనున్నారని నిన్నమొన్నటి వరకు ప్రచారం సాగింది. అయితే హరీశ్​.. ఇప్పుడీ ప్రాజెక్ట్​ కోసం రామ్​పోతినేనితో కమిట్​ అయ్యారని తెలిసింది.

Rampotineni Harishshankar movie
రామ్​పోతినేని హరీశ్​శంకర్​ సినిమా

Rampotineni Harishshankar movie: 'ఇస్మార్ట్​ శంకర్​'తో లవర్​బాయ్​ ఇమేజ్​ నుంచి బయపడిన హీరో రామ్​పోతినేని.. ఉస్తాద్​గా యూత్​లో మరింత క్రేజ్​ పెంచుకున్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్​లో పెడుతూ కెరీర్​లో స్పీడు పెంచారు. ఇప్పటికే లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్​'​ చేస్తున్న ఆయన.. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో ఓ మాస్​ ఎంటర్​టైనర్​ మూవీ చేయనున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రాజెక్ట్​కు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారని తెలుస్తోంది.

దర్శకుడు హరీశ్​ శంకర్​.. పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​తో 'భవదీయుడు భగత్​సింగ్​' సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఇది ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుపుకుంటోంది. అయితే పవన్​కు ఉన్న బిజీ షెడ్యూల్​ కారణంగా ఈ చిత్రం సెట్స్​పైకి వెళ్లడానికి మరింత ఆలస్యం పట్టే అవకాశముంది. ఈ గ్యాప్​లో హరీశ్​.. ఓ సినిమా చేయాలని ప్లాన్​ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే హీరో అల్లుఅర్జున్​తో చర్చలు కూడా జరిపినట్లు ప్రచారం సాగింది. అయితే ఇప్పుడీ ప్రచారం రూట్ మారింది. సీన్​లో రామ్​ పోతినేని ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్​గా హరీశ్​-రామ్ మధ్య కూడా కథా చర్చలు జరిగాయని, స్టోరీ నచ్చడం వల్ల ఉస్తాద్​ పచ్చజెండా ఊపారని టాక్​ వినిపిస్తోంది.

మరి బన్నీ రిజెక్ట్​ చేయడం వల్లే రామ్​తో ప్రాజెక్ట్​ చేసేందుకు హరీశ్​ ఫిక్స్​ అయ్యారా? రామ్​తో నిజంగానే మూవీకి కమిట్​ అయ్యారా? అనేది తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే...

ఇదీ చూడండి: 'నాంది' కాంబో రిపీట్​.. ఇంట్రెస్టింగ్​ పోస్టర్​తో అల్లరినరేశ్ కొత్త సినిమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.