ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM

author img

By

Published : Apr 3, 2022, 6:58 PM IST

.

7pm Top news
ప్రధాన వార్తలు

  • హైదరాబాద్​ రాడిసన్ బ్లూ పబ్​ కేసులో ట్విస్ట్..
    బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. సంచలనంగా మారిన రాడిసన్ బ్లూ పబ్​కు 24 గంటలు నడుపుకునే అనుమతి ఉందని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం సెప్టెంబర్​ వరకు పబ్​కు అన్ని రకాల అనుమతులూ ఉన్నాయని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'షెడ్యూల్డ్​ ఏరియాలో ఏర్పాటు చేసిన మొదటి న్యాయస్థానం ఇదే..'
    విజయనగరం జిల్లాలో నూతనంగా నిర్మించిన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భవనం, మేజిస్ట్రేట్ క్వార్టర్స్ భవన సముదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దొనాది రమేశ్ ప్రారంభించారు.షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెుదటి న్యాయస్థానం ఇదేనని జస్టిస్ రమేశ్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చెత్త పన్ను కట్టలేదని.. పింఛన్ డబ్బు కత్తిరించారు..!
    చెత్తపన్ను, ఇంటి పన్ను కట్టలేదంటూ వృద్ధుల పింఛన్‌ సొమ్ము నుంచి నగదు మినహాయించుకున్న ఘటనలు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి. పింఛన్‌ సొమ్ము మొత్తం ఇవ్వాలంటూ కాళ్లా, వేళ్లాపడ్డా.. వాలంటీర్లు కనికరించలేదని బాధితులు వాపోతున్నారు..!. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'యోగీ జీ.. 'బుల్డోజర్'​తో మా ఇల్లు కూల్చేయండి ప్లీజ్!'
    ఉత్తర్​ప్రదేశ్​ ప్రజల్లో ప్రస్తుతం 'బుల్డోజర్ బాబా'​ భయం నెలకొంది. అధికారులు ఎక్కడ బుల్డోజర్లతో వచ్చిన తమ భవనాలు కూల్చేస్తారేమోనని నిందితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. మా ఇంటిని కూల్చేయండి ప్లీజ్​ అంటూ ఓ వ్యక్తి ప్రభుత్వానికి లేఖ రాశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'రైతులారా.. ట్రాక్టర్లు రెడీ చేయండి.. మరోసారి తడాఖా చూపిద్దాం!'
    రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే మరోమారు ఉద్యమం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్​ నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 6000 ఇచ్చి రైతులకు బిచ్చగాళ్లును చేస్తోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎక్స్​ప్రెస్​ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన 10 బోగీలు
    మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సమీపంలోని లహవిత్ నుంచి దేవాలి దగ్గర నాసిక్‌కు వెళ్లే రైలు పట్టాలు తప్పింది. ఎల్‌టిటి-జయ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లోని 10 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెరికాలో కాల్పుల కలకలం- ఆరుగురు బలి
    అమెరికాలో తుపాకీ విషసంస్కృతికి మరో ఆరుగురు బలయ్యారు. 9 మంది గాయపడ్డారు. సాక్రమెంటోలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ ఒక్క ఇన్నింగ్స్​.. తెలుగు కుర్రాడిని స్టార్​ని చేసింది..!
    తెలుగు కుర్రాడు 19 ఏళ్ల తిలక్​ వర్మ.. ఐపీఎల్​లో ఒకే ఒక ఇన్నింగ్స్​తో స్టార్​గా మారిపోయాడు. రాజస్థాన్​ రాయల్స్​పై ఒత్తిడిలో అతడు ఆడిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే.. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన తిలక్​ కుటుంబానికి సొంత ఇల్లు లేదంట. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సమ్మర్​లో సినిమా జాతర.. వచ్చే 4 నెలల్లో రిలీజయ్యే చిత్రాలివే!
    కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఒక పండగ వాతావరణం నెలకొంది. 'అఖండ'తో మొదలైన బాక్సాఫీస్ ​ఉత్సాహం.. 'ఆర్​ఆర్​ఆర్'​తో​ రెట్టింపు అయ్యింది. రాబోయే సినిమాలకు కూడా ఇది శుభపరిణామం అని చెప్పాలి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆర్​ఆర్​ఆర్'​ మరో అరుదైన రికార్డు.. 'బీస్ట్​' తెలుగు ట్రైలర్​ ఎప్పుడంటే..
    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్ఆర్' మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా రికార్డులను బ్రేక్​ చేస్తున్న ఈ చిత్రం.. బుక్​మై షోలో అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.