ETV Bharat / entertainment

నా బాడీ సూపర్ డీలక్స్​ : బిగ్​బాస్ బ్యూటీ అషురెడ్డి - Yevam Movie Teaser

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 6:29 PM IST

Updated : May 24, 2024, 7:29 PM IST

Ashureddy Chandini Choudary yevam Movie : నా బాడీ సూపర్ డీలక్స్​ అంటోంది బిగ్​బాస్ ఫేమ్​ అషురెడ్డి. తాజాగా ఆమె, చాందిని చౌదరి కలిసి నటించిన యేవమ్ టీజర్ విడుదలై ఆసక్తి రేపుతోంది.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Ashureddy Chandini Choudary yevam Movie : చాందిని చౌదరి ఈ మధ్య కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస హిట్లను అందుకుంటోంది. రీసెంట్​గా గామి చిత్రంతో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ భామ త్వరలో మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత యేవమ్ అనే సినిమాతో ఆడియెన్స్​ను అలరించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్​ను దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఇంటెన్సివ్​గా సాగింది. ఒకరిపై శృతిమించిన వ్యామోహం ఉంటే ఎన్ని ఘోరాలైన చేయిస్తుంది అనే ఎలిమెంట్​ను తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ప్రచార చిత్రంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

వరుసగా జరుగుతున్న హత్యల కేసను ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్​గా ఛార్జ్ తీసుకున్న చాందిని ఏం చేసింది అనే ఆసక్తికర థ్రిల్లింగ్ అంశంతో సినిమా ఉండనుంది. ఒక ఫోక్​ సాంగ్​తో ప్రారంభమైన ఈ టీజర్​లో వశిష్ఠ సింహా, అషురెడ్డి, చాందిని చౌదరి పాత్రలను ఇంట్రడక్షన్​ ఇచ్చారు. ఈ క్రమంలోనే నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ అషురెడ్డి డైలాగ్ చెప్పడం మరింత క్యూరియాసిటినీ పెంచింది. వశిష్ట సింహా పాత్ర కూడా నెగటివ్ షేడ్స్​ ఉన్న క్యారెక్టర్​లా చూపిస్తూ సస్పెన్స్​ క్రియేట్​ చేస్తోంది. ఆ తర్వాత వరుస హత్యలు జరగడం, దానిని అప్పుడే పోలీస్​ ఆఫీసర్​గా జాయిన్​ అయిన చాందిని చౌదరి దర్యాప్తు చేయడం వంటి సీన్లను చూపించారు. అనంతరం యుగంధర్ అనే పేరుతో చౌందినికి కాల్ చేసి తానే ఈ హత్యలన్నీ చేస్తున్నట్లు చెప్పడం, అతడిని పట్టుకునేందుకు చాందిని చౌదరి ప్రయత్నించడం వంటివి సీన్లతో ప్రచార చిత్రాన్ని ముగించారు.

ఇంకా భరత్ రాజ్, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌ కూడా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో ప్రకాష్‌ దంతులూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కీర్తన శేషు, నీలేష్‌ మందలపు సంగీతం అందిస్తున్నారు. కాగా, "యేవమ్ సినిమా ఓపెనింగ్‌కు వ‌చ్చిన నేను మ‌ళ్లీ ఆ చిత్ర టీజ‌ర్‌ను విడుదల చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. యేవమ్ చాలా మంచి టైటిల్‌. ఈ ప్ర‌మోష‌నల్ కంటెంట్ చూస్తుంటే సినిమా కూడా కొత్త‌గా ఉంటుంద‌ని అనిపిస్తుంది" అని హరీశ్​ శంకర్ అన్నారు.

సమంతతో రొమాంటిక్ సీన్స్​ - వైరల్​గా నాగ చైతన్య రియాక్షన్ వీడియో - Manam Movie Rerelease

అనసూయ జలకాలాట - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పిక్స్ చూశారా? - Anasuya Vacation Tour Pics

Last Updated : May 24, 2024, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.