ETV Bharat / entertainment

'ఆర్​ఆర్​ఆర్'​ మరో అరుదైన రికార్డు.. 'బీస్ట్​' తెలుగు ట్రైలర్​ ఎప్పుడంటే..

author img

By

Published : Apr 3, 2022, 5:05 PM IST

RRR Bookmyshow Rating: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్ఆర్' మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా రికార్డులను బ్రేక్​ చేస్తున్న ఈ చిత్రం.. బుక్​మై షోలో అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. మరోవైపు 'బీస్ట్' తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం.

beast telugu trailer
rrr bookmyshow rating

RRR Bookmyshow Rating: ఎన్టీఆర్​-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​.. బాక్సాఫీస్​ వద్ద రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా.. మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రముఖ టికెట్ బుక్సింగ్స్​ సంస్థ బుక్​మై షోలో అత్యధిక రేటింగ్​ పొందిన చిత్రంగా నిలిచింది 'ఆర్ఆర్ఆర్'. 90శాతం రేటింగ్​తో 5.55 లక్షలకు పైగా ఓట్లను సాధించింది.

rrr bookmyshow rating
'ఆర్​ఆర్​ఆర్'​

'బీస్ట్' తెలుగు ట్రైలర్: తమిళ సూపర్​స్టార్ విజయ్ నటించిన 'బీస్ట్'​ తెలుగు ట్రైలర్​ను ఏప్రిల్ 5న సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన తమిళ ట్రైలర్​ రికార్డు వ్యూస్​తో దూసుకుపోతూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్​పిక్చర్స్​ నిర్మించింది. అనిరుధ్​ రవిచందర్​ సంగీతం అందించారు. పూజా హెగ్డే హీరోయిన్​. ఏప్రిల్‌ 13న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

vijay beast telugu trailer
'బీస్ట్​'
prabhu deva birthday
.
sreeleela new movie
శ్రీలీల

ఇదీ చూడండి: శ్రీలీలతో నితిన్ కొత్త సినిమా.. కూలీగా మారిన సాయిపల్లవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.