ETV Bharat / business

UPI Lite Limit Increase : నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్​.. ఒకేసారి ఎంత చెల్లించవచ్చంటే..

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 6:21 PM IST

UPI Lite Limit Increase : యూపీఐ లైట్​ ద్వారా చేసే చెల్లింపుల పరిమితిని రూ.200 నుంచి రూ.500 వరకు పెంచింది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ఇంటర్నెట్​ లేకుండా చిన్న మొత్తాలను చెల్లిచేందుకు తీసుకువచ్చిన యూపీఐ లైట్​ను.. మరింత విసృతి చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

upi-lite-limit-increase-upi-transaction-limit-offline-mode-raise-to-rs-500-says-reserve-bank-of-india
యూపీఐ లైట్​ చెల్లింపుల పరిమితి పెంపు

UPI Lite Limit Increase : ఇంటర్నెట్​ లేకుండా చిన్న మొత్తాలను చెల్లిచేందుకు తీసుకువచ్చిన యూపీఐ లైట్​లో కీలక మార్పులు చేసింది రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా. చెల్లింపుల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.500 వరకు పెంచింది. ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా, అసలు లేని ప్రాంతాల్లో డిజిటల్​ చెల్లింపులు పెంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఉపయోగించి ఆఫ్​లైన్​ మోడ్​లోనే రోజుకు రూ.2వేల వరకు చెల్లింపులు చేయవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం యూపీఐ లైట్​లో నెలకు కోటి లావాదేవీలు జరుగుతున్నట్లు ఆర్​బీఐ పేర్కొంది.

యూపీఐ లైట్​ వ్యాలెట్​..
Upi Lite Without Internet : పేటీఎం, మొబీక్విక్​ వంటి ఆన్​డివైజ్​ వ్యాలెట్ల తరహాలోనే యూపీఐ లైట్​ వ్యాలెట్​ను ప్రవేశపెట్టనున్నట్లు కొద్ది రోజుల క్రితం ఎన్​పీసీఐ ప్రకటించింది. దీన్ని ఉపయోగించి వినియోగదారులు చిన్న మొత్తంలో లావాదేవీలు​ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్​లో ఫండ్స్​ను కూడా స్టోర్​ చేసుకునే సదుపాయాన్ని ఎన్​పీసీఐ కల్పిస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుండంటే..
UPI Lite Works Offline : యూపీఐ లైట్​ వ్యాలెట్​.. అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో 'నియర్​ ఆఫ్​లైన్​ మోడ్​'లో పనిచేస్తుందని ఎన్​పీసీఐ వెల్లడించింది. డెబిట్​ పేమెంట్స్​ ఆఫ్​లైన్​లో, క్రెడిట్​ పేమెంట్స్​ ఆన్​లైన్​లో జరుగుతాయి. యూజర్ ఆన్​లైన్​లోకి వచ్చాక క్రెడిట్​ పేమెంట్స్​ అప్​డేట్​ అవుతాయి. అయితే క్రమంగా అన్ని రకాల చెల్లింపులూ ఆఫ్​లైన్​కు వచ్చేలా కృషి చేస్తామని ఎన్​పీసీఐ పేర్కొంది. ఈ యూపీఐ లైట్ వ్యాలెట్​లో ఉండే నగదుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదని ప్రారంభ సమయంలో ఆర్​బీఐ స్పష్టం చేసింది. యూపీఐ లైట్​ ఖాతాల సంఖ్య యూజర్లు వాడే యూపీఐ యాప్​ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

ఇంటర్నెట్​ లేకుండానే చెల్లింపులు​.. 'యూపీఐ లైట్'​ ఫీచర్​తో పేటీఎం..
Paytm UPI Lite : ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ అయిన పేటీఎం.. కొద్ది రోజుల క్రితం సరికొత్త ఫీచర్​తో యూజర్ల ముందుకు వచ్చింది. పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్​ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా.. 'యూపీఐ లైట్' అనే సరికొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టింది. యూపీఐ ద్వారా డబ్బును పంపించటం, స్వీకరించే ప్రక్రియలను సులభతరం చేసేందుకు ఈ యూపీఐ లైట్​ ఫీచర్​ను తీసుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

How to Check Income Tax Refund Status : మీ 'ఐటీ రిఫండ్ స్టేటస్'.. ఈజీగా ఇలా తెలుసుకోండి!

Laptop Buying Mistakes : కొత్త ల్యాప్​టాప్​ కొనాలా?.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.