ETV Bharat / bharat

క్రైమ్​ సీరియల్​ చూసి భర్త మర్డర్​కు ప్లాన్​.. ఆస్తి కోసం భార్య దారుణం.. ఫుల్​ డోస్​ మెడిసిన్​ ఇచ్చి..

author img

By

Published : Dec 9, 2022, 10:56 PM IST

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. ఆస్తి కోసం ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. తొలుత భర్తను కొట్టించి చంపించేందుకు ప్రయత్నించగా అతడు బతికాడు. అనంతరం అధిక మోతాదులో మందులు ఇచ్చి చంపేసింది.

wife murdered husband for property
ఆస్థి కోసం భర్తను చంపింది భార్య

ఆస్తి కోసం భర్తను దారుణంగా కడతేర్చింది ఓ భార్య. క్రైమ్​ సీరియల్ చూసి.. అందులోని ఓ సన్నివేశం ఆధారంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. తొలుత భర్తను తీవ్రంగా కొట్టించి ఆసుపత్రిలో చేర్పించింది. అతడు కోలుకున్న తర్వాత డాక్టర్​ రాసిన మందులను అధిక డోస్​లతో ఇచ్చి కడతేర్చింది. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ దారుణ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్​కు చెందిన రిషబ్​, స్పప్న భార్యాభర్తలు. వీరిద్దరు కల్యాణ్​పుర్​లో నివాసం ఉంటున్నారు. నవంబర్ 27న తన స్నేహితుడు మనీశ్​​తో కలిసి ఓ పెళ్లికి వెళ్లాడు రిషబ్. అనంతరం తిరిగి వస్తుండగా.. కొందరు వ్యక్తులు రిషబ్​పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు.. చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కొన్నిరోజులకు కోలుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. డిసెంబర్​ 3న మళ్లీ అతడి ఆరోగ్యం క్షీణించింది. మరోసారి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు రిషబ్​.

అనంతరం భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది స్వప్న. తన భర్త మరణంపై అనుమానాలున్నాయని విచారణ జరిపించాలని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రిషబ్​ మృతదేహానికి పోస్ట్​మార్టం పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికలో మందులు ఎక్కువ డోస్​లో తీసుకోవడం వల్లే​ చనిపోయాడని తేలింది.

స్పప్నపైనే అనుమానంతో విచారణ చేసిన పోలీసులు.. మొబైల్​ ఫోన్​ ఆధారంగా నిజనిజాలు రాబట్టారు. రిషబ్​ భార్యనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా వారు తేల్చారు. తన ప్రియుడు రాజుతో కలిసి.. స్పప్న తన భర్తను చంపేందుకు ప్లాన్​ చేసినట్లుగా పోలీసులు నిర్ధరించారు. భర్తను కొట్టించి చంపించేందుకు ప్రయత్నించగా చికిత్స పొంది బతికాడని, అనంతరం అధిక మోతాదులో మందులు ఇచ్చి చంపినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

తన భర్త పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయని, వాటి గురించి అడిగినప్పుడల్లా విషయం దాటవేసేవాడని స్పప్న తెలిపింది. ఆస్తి తనకు ఇవ్వకుండా మరెవరికైనా ఇస్తాడేమోనని భావించి రిషబ్​ను ఆమె​ చంపినట్లు ఒప్పుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.