ETV Bharat / technology

విన్​ఫాస్ట్ 'VF6', 'VF7' డెలివరీలు షురూ- వీటి రేంజ్ ఎంతో తెలుసా?

విన్​ఫాస్ట్ 'VF6', 'VF7' డెలివరీలు ప్రారంభం- వివరాలు మీకోసం!

Vinfast VF6
Vinfast VF6 (Photo Credit- VinFast India)
author img

By ETV Bharat Tech Team

Published : October 27, 2025 at 12:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "విన్‌ఫాస్ట్ VF6", "VF7" మోడళ్ల డెలివరీలు భారతదేశంలో ఎట్టకేలకూ ప్రారంభమయ్యాయి. ఈ కార్ల ప్రారంభ షిప్‌మెంట్‌లు ఇప్పటికే కొచ్చి, జైపూర్, ఇతర రాష్ట్రాలలోని వినియోగదారులకు డెలివరీ అయ్యాయి. వియత్నామీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇటీవలే సెప్టెంబర్ 2025లో ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంఛ్​ చేసి అధికారికంగా భారతదేశంలోకి అరంగేట్రం చేసింది. తాజాగా ఇప్పుడు డెలివరీలు ప్రారంభించింది.

వీటి లాంఛ్​ సమయంలో విన్‌ఫాస్ట్ స్థానిక ఉత్పత్తి, రిటైల్, సర్వీస్ నెట్‌వర్క్‌ల కోసం తన దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా ప్రకటించింది. ఈ రెండు మోడళ్లను తమిళనాడులోని కంపెనీ తూత్తుకుడి ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తున్నారు. ఇది స్థానిక ఉత్పత్తికి, దేశంలోని ఇతర మార్కెట్ల ఎగుమతులకు విన్‌ఫాస్ట్ హబ్​గా పనిచేస్తుంది.

Vinfast VF7
Vinfast VF7 (Photo Credit- VinFast India)

విన్​ఫాస్ట్ VF6 ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు: "విన్​ఫాస్ట్ VF6" కాంపాక్ట్ EV SUV విభాగంలో పోటీపడుతుంది. ఇది ప్రీమియం ఫీచర్లు, మంచి రేంజ్​ కోసం చూస్తున్న యువ పట్టణ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది. అయినప్పటికీ దీని ధర రూ. 20 లక్షల లోపే ఉంటుంది. మార్కెట్​లో ఈ "విన్​ఫాస్ట్ VF6" ధర రూ. 16.49 లక్షల నుంచి రూ.18.29 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ అనే మూడు ట్రిమ్‌లలో లభిస్తుంది.

ఈ కారు 59.6 kWh బ్యాటరీని ఉపయోగిస్తుంది. ఇది ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారు 198 bhp, 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 468km ARAI-సర్టిఫైడ్ రేంజ్​ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీని బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 25 నిమిషాల్లో 10 శాతం నుంచి 70 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

Vinfast VF6
Vinfast VF6 (Photo Credit- VinFast India)

ఈ SUV 8.9 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. ఇది సిటీ, హైవే డ్రైవింగ్‌కు సరిపోతుంది. ఇక ఫీచర్ల పరంగా "విన్​ఫాస్ట్ VF6" ఆధునిక 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్​ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, 360-డిగ్రీ కెమెరా, ADAS సేఫ్టీ సూట్‌తో వస్తుంది.

ఇది ఏడు ఎయిర్‌బ్యాగులు, 190mm గ్రౌండ్ క్లియరెన్స్, 2,730mm వీల్‌బేస్‌తో స్టాండర్డ్​గా వస్తుంది. ఇది దీనికి స్థిరత్వం, సంతృప్తికరమైన రహదారి ఉనికిని ఇస్తుంది. తన ఉత్పత్తిపై విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ కంపెనీ ఈ కారుపై 7 సంవత్సరాల లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వారంటీని లాంఛ్ ఛార్జింగ్ బెనిఫిట్ ప్యాకేజీతో పాటు అందిస్తోంది.

ట్రిమ్ ఆప్షన్​లుఎక్స్​-షోరూమ్ ధరలుబ్యాటరీఇంటీరియర్ కలర్డ్రైవ్‌ట్రెయిన్
VF6 ఎర్త్రూ. 16,49,00059.6 kWhబ్లాక్FWD
VF6 విండ్రూ. 17,79,00059.6 kWhమోకా బ్రౌన్FWD
VF6 విండ్ ఇన్ఫినిటీరూ. 18,29,00059.6 kWhమోకా బ్రౌన్FW

విన్​ఫాస్ట్ VF7 ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు: ఒక సెగ్మెంట్ హైయర్ "విన్​ఫాస్ట్ VF7" అనేది మరింత పవర్, రేంజ్, స్పేస్​ను కోరుకునే కొనుగోలుదారులనే లక్ష్యంగా చేసుకున్న మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV. దీని ధర రూ. 20.89 లక్షల నుంచి రూ.25.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ కారు 5 ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది. అవి: ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ, స్కై, స్కై ఇన్ఫినిటీ.

aVinfast VF7
Vinfast VF7 (Photo Credit- VinFast India)

ఈ కారు 59.6 kWh, 70.8 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్​లతో వస్తుంది. దీన్ని 2WD లేదా AWD డ్రైవ్‌ట్రెయిన్‌తో కొనుగోలు చేయొచ్చు. అత్యల్ప వేరియంట్‌లో పవర్ 175 hp, 250 Nm నుంచి AWD వేరియంట్‌లో 350 bhp, 500 Nm వరకు ఉంటుంది. రేంజ్-టాపింగ్ "VF7" 5.8 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. ఇది 510 km వరకు క్లెయిమ్ చేసిన రేంజ్​ని అందిస్తుంది.

ట్రిమ్ ఆప్షన్​లుఎక్స్​-షోరూమ్ ధరలుబ్యాటరీఇంటీరియర్ కలర్డ్రైవ్‌ట్రెయిన్
VF7 ఎర్త్రూ. 20,89,00059.6 kWhబ్లాక్FWD
VF7 విండ్రూ. 23,49,00070.8 kWhమోకా బ్రౌన్FWD
VF7 విండ్ ఇన్ఫినిటీరూ. 23,99,00070.8 kWhమోకా బ్రౌన్FWD
VF7 స్కైరూ. 24,99,00070.8 kWhమోకా బ్రౌన్FWD
VF7 స్కై ఇన్ఫినిటీరూ. 25,49,00070.8 kWhమోకా బ్రౌన్AWD