ETV Bharat / technology

విన్​ఫాస్ట్ నుంచి భారత్​కు అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు!- రేటెంతో తెలుసా?

భారత్​లో మరో కారు పేటెంట్ దాఖలు చేసిన విన్​ఫాస్ట్- MG కామెట్​తో పోటీ!

VinFast Minio Green Three-Door Electric Hatchback
VinFast Minio Green Three-Door Electric Hatchback (Photo Credit- VinFast)
author img

By ETV Bharat Tech Team

Published : August 12, 2025 at 5:26 PM IST

3 Min Read
Choose ETV Bharat

VinFast New Electric Car Patent: ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాకు పోటీగా భారత్​లో విన్​ఫాస్ట్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ వియత్నామీస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఇటీవలే గుజరాత్​లోని సూరత్​లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. కంపెనీ తన 'VF 7', 'VF 6'తో అధికారికంగా భారతదేశంలో అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే అంటే జులై 15న ఈ వాహనాల ప్రీ-బుకింగ్‌లనూ ప్రారంభించింది. తాజాగా తన కొత్త కారు డిజైన్ పేటెంట్‌ను భారతదేశంలో రిజిస్టర్ చేసింది. దీని పేరు "విన్‌ఫాస్ట్ మినియో గ్రీన్". ఇది విన్​ఫాస్ట్​కు చెందిన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు.

ఇటీవలే కంపెనీ తన లిమో గ్రీన్ మూడు-వరుసల SUV పేటెంట్​ డిజైన్​ను భారత్​లో రిజిస్టర్ చేసింది. తాజాగా విన్‌ఫాస్ట్ ఇప్పుడు భారతదేశంలో మినియో గ్రీన్ మూడు-డోర్ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌ పేటెంట్​ దాఖలు చేసింది. కమర్షియల్ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ 'గ్రీన్' వాహన శ్రేణిలో భాగమైన "మినియో గ్రీన్" అనేది ఇప్పటివరకు ఉన్న విన్‌ఫాస్ట్ కార్లలో అతి చిన్న ఎలక్ట్రిక్ వాహనం. దీనిని అఫర్డబుల్ అర్బన్ మోటరింగ్‌ను అందించేందుకు రూపొందించారు.

Side Profile of VinFast Minio Green
Side Profile of VinFast Minio Green (Photo Credit- VinFast)

విన్​ఫాస్ట్ మినియో గ్రీన్ సైజ్: ఈ మినియో గ్రీన్ పరిమాణం గురించి మాట్లాడుకుంటే ఈ ఎలక్ట్రిక్ కారు పొడవు 3,090 mm ఉంటుంది. అంటే ఇది భారత మార్కెట్లో విక్రయించే MG కామెట్ కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. కానీ కొంచెం స్లిమ్, పొడవుగా ఉంటుంది. దీని వీల్ బేస్ 2,065mm. ఇది MG కామెట్ (2,010 mm) కంటే కాస్త ఎక్కువ.

విన్​ఫాస్ట్ మినియో గ్రీన్ ఎక్స్​టీరియర్: దీని ఎక్స్​టీరియర్ చాలా సింపుల్​గా ఉంటుంది. ఇందులో కవర్లు, ఫ్లాప్-టైప్ డోర్ హ్యాండిల్స్ లేకుండా 13-అంగుళాల స్టీల్ వీల్స్ ఉంటాయి. ఇది కాకుండా ఈ ఎలక్ట్రిక్ కారు రౌండ్ LED హెడ్‌లైట్‌ల యూనిట్‌లను కలిగి ఉంటుంది. కానీ ప్లెయిన్, స్టాక్డ్ టెయిల్​లైట్​లు హాలోజన్‌తో ఉంటాయి.

విన్ ఫాస్ట్ మినియో గ్రీన్ ఇంటీరియర్: మినియో గ్రీన్ ఇంటీరియర్ గురించి చెప్పాలంటే దీనిని కూడా దాని ఎక్స్​టీరియర్ డిజైన్ మాదిరిగానే సింపుల్​గా ఉంచారు. దీని డాష్‌బోర్డ్ ఇంకా సింపుల్​గా ఉంటుంది. దానిలో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ లేదు. డాష్‌బోర్డ్ మధ్యలో రెండు AC వెంట్లు మాత్రమే ఇచ్చారు. ఈ విన్ ఫాస్ట్ మినియో గ్రీన్‌లో మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ మాత్రమే ఉంది.

Interior of VinFast Minio Green
Interior of VinFast Minio Green (Photo Credit- VinFast)

ఎంటర్టైన్మెంట్ కోసం ఇది రెండు స్పీకర్లతో FM రేడియోను కలిగి ఉంది. దీని పవర్ విండో స్విచ్‌లు ఫ్రంట్ సీట్ల మధ్య ఉంచారు. ఇది ఫుల్-కలర్ డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లేను కూడా కలిగి ఉంది. కారు వెనక వైపున ఇద్దరు ప్రయాణీకుల కోసం ఒక బెంచ్ సీటు ఉంది. దీనికి రెండు వైపులా ప్రత్యేక కప్ హోల్డర్లు అందించారు.

Seating Layout of VinFast Minio Green
Seating Layout of VinFast Minio Green (Photo Credit- VinFast)

విన్​ఫాస్ట్ మినియో గ్రీన్ పవర్​ట్రెయిన్: దీనిలో 14.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని సహాయంతో ఈ కారు 170km(NEDC) వరకు డ్రైవింగ్ రేంజ్​ని అందించగలదు. దీని రియల్ వరల్డ్ రేంజ్ గణాంకాలు ఇంకా వెల్లడి కానప్పటికీ ఈ ఫిగర్స్ కొంచెం తక్కువగా ఉండవచ్చు. ఈ కారు ఒకే ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. ఇది గరిష్ఠంగా 27 bhp పవర్, 65 Nm పీక్ టార్క్​ని అందిస్తుంది. అంటే విన్​ఫాస్ట్ మినియో గ్రీన్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.

Rear Profile of VinFast Minio Green
Rear Profile of VinFast Minio Green (Photo Credit- VinFast)

విన్​ఫాస్ట్ మినియో గ్రీన్ ధర: వియత్నాంలో మినియో గ్రీన్ ధర రూ. 8.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది దీనిని సరసమైన విన్​ఫాస్ట్ ఎలక్ట్రిక్ కారుగా నిలుపుతుంది. అయితే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అతి చిన్న SUV, భారతదేశంలో కూడా ప్రదర్శించిన విన్​ఫాస్ట్ "VF3" కారు "మినియో గ్రీన్" కంటే దాదాపు లక్ష రూపాయలు ఎక్కువ ధరతో ఉంది.

విన్​ఫాస్ట్ భారతదేశంలో తన "VF6", "VF7" SUVల విడుదలతో తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. ఆ తర్వాత కంపెనీ 2026లో భారత్​కు తన మూడవ, అత్యంత సరసమైన మోడల్‌గా విన్​ఫాస్ట్ "VF3"ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. విన్‌ఫాస్ట్ భారతదేశంలో టెస్లా, BYD, టాటా & మహింద్రా వంటి దేశీయ కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. టెస్లా ఇప్పటికే భారత్​లో రెండు షోరూమ్​లను ప్రారంభించింది. తన మొదటి షోరూమ్​ను ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రారంభించగా, నిన్ననే అంటే ఆగస్టు 11న దిల్లీలో మరో షోరూమ్‌నూ ప్రారంభించింది.