కడపలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన - ముస్లింలకు 'ఓట్‌ ఫర్‌ ఫ్యాన్‌' స్టిక్కర్లతో వాటర్‌ బాటిళ్లు పంపిణీ - YCP Campaign in Ramzan celebrations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 3:14 PM IST

thumbnail

YSRCP Leaders Election Code Voilation in Kadapa District : కడపలో వైఎస్సార్సీపీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలంతా కడప బిల్డప్ సర్కిల్లోని ఈద్గాలో ప్రార్థన చేస్తుండగా "ఓట్ ఫర్ ఫ్యాన్" పేరుతో ఉన్న వాటర్ బాటిళ్లను వైఎస్సార్సీపీ నాయకులు పంపిణీ చేశారు. ఆ సమయంలో ఈద్గాలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాతో పాటు ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన జమీల్ సోదరులు కూడా అక్కడే ఉన్నారు. జమీల్ సోదరులే వీటిని పంపిణీ చేశారని స్థానికంగా ప్రచారం సాగింది. ఈ ఘటనపై స్థానిక ఎన్నికల అధికారులకు విపక్ష నాయకులు సమాచారం అందించారు.   

YSRCP Campaign in Ramzan Festival : వైఎస్సార్సీపీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్​ ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వైసీపీ నేతలు కోడ్​కు అతీతంగా వ్యవహరించడం, ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అన్నీ జరుగుతున్నా జగనన్న సైన్యం తీరు మారడం  లేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.    

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.