ఎన్డీయేకు 130 సీట్లు వస్తాయి - చంద్రబాబు సీఎం కావడం ఖాయం: బుద్ధా వెంకన్న - Buddha Venkanna

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 7:07 PM IST

thumbnail
ఎన్డీయేకు 130 సీట్లు వస్తాయి - చంద్రబాబు సీఎం కావడం ఖాయం: బుద్ధా వెంకన్న (ETV Bharat)

TDP Leader Buddha Venkanna: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి 130 సీట్లకు పైగా విజయం సాధించబోతుందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడలో తెలుగుదేశం కార్యాలయంలో కూటమి నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో జగన్​ను ఓడించాలని వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారన్నారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు సాగనంపే విధంగా కూటమికి ఓట్లు వేశారని వెంకన్న తెలిపారు. 2014లో వచ్చిన 104 సీట్లను సైతం కూటమి అధిగమించబోతుందని వెంకన్న పేర్కొన్నారు. జగన్​పై ఉన్న కక్షతో ప్రజలు రాత్రి వరకు ఉండి ప్రతి ఒక్కరూ ఓటు వేశారని ఆయన అన్నారు. 

చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేయడం తధ్యమని ఆయన పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలలో అవకతవకలకు పాల్పడిన వారి ఫైళ్లను కూడా మాయం చేసేలా కుట్రలు చేస్తున్నారన్నారు. ఓడిపోతారనే విషయం తెలిసి కూడా బొత్స సత్యనారాయణ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని వెంకన్న విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.