LIVE : మక్తల్‌ విజయ సంకల్ప యాత్రలో కిషన్‌రెడ్డి - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 10:18 AM IST

Updated : Feb 21, 2024, 10:32 AM IST

thumbnail

Kishan Reddy Live : లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రచారం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన 5 విజయ సంకల్ప యాత్రల్లో నాలుగింటికి మంగళవారం శ్రీకారం చుట్టింది. కృష్ణమ్మ క్లస్టర్‌ యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి  ప్రారంభించగా, కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమురం భీం క్లస్టర్‌ యాత్రకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, భాగ్యలక్ష్మి క్లస్టర్‌ యాత్రకు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ హాజరయ్యారు. రాజరాజేశ్వర క్లస్టర్‌ యాత్రను కేంద్రమంత్రి బీఎల్‌ వర్మ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ శ్రీకారం చు‌ట్టారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, ధర్మబద్ధమైన మోదీ  పాలన కావాలో, అవినీతి, దోపిడీమయమైన కాంగ్రెస్ పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించిన పాపానికి ఈ రెండు రాష్ట్రాల్లో సంపదను దోచి, రాహుల్ బృందం లోక్‌సభ ఎన్నికల్లో పంచి పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. తాజాగా మక్తల్‌లో విజయ సంకల్ప యాత్రలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

Last Updated : Feb 21, 2024, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.