ETV Bharat / state

ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా - తల్లిదండ్రులకు తీరని కడుపుకోత - Three Died in Nizamabad

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 12:31 PM IST

Three Young People Drowned in Pond at Nizamabad : వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి సరదాగా ఈత కొట్టడానికి పిల్లలు ఆసక్తి చూపుతుంటారు. సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకుండా నీటిలోకి దిగి ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఈత సరదా ముగ్గురు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది.

Three young people drown in pond
Three young people drown in pond

Three Young People Drowned in Pond at Nizamabad : ఎండాకాలం మొదలవడంతో పట్టణాలు, గ్రామాల్లోని పిల్లలు చెరువులు, బావులు, కాలువల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈత సరదా కాస్తా కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తోంది. ఓవైపు ఈతపై ప్రావీణ్యం లేకపోవడం, మరోవైపు నీటి వనరుల లోతుపై అంచనా లేమి, కొలనుల వద్ద పర్యవేక్షణ కొరవడటం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుతోంది. రాష్ట్రంలో నిత్యం ఏదో చోట జరుగుతున్న ఈ ఘటనలు ప్రస్తుతం ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Drown Deaths in Telangana : పిల్లల ఈత సరదా (Three Persons Died After Going Swimming) ముగ్గురు తల్లులకు కడుపుకోత మిగల్చగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తల్లిదండ్రులకు ముగ్గురూ ఏకైక సంతానం కావడం వారంతా చెరువులో మునిగి మరణించడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన మాక్లూర్‌ మండలం ఒడ్డ్యాట్‌పల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఒడ్డ్యాట్‌పల్లి గ్రామానికి చెందిన తిరుపతి(19), మహేశ్‌(19), నరేశ్‌(18), సాయితేజ(19), వినోద్‌(18)లు గ్రామశివారులో ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు.

vv
మృతులు మహేశ్, తిరుపతి, నరేశ్

ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం.. సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చి..

లోపలికి దిగిన కొద్దిసేపటికే మహేశ్‌, నరేశ్‌, తిరుపతి మునిగిపోయారు. వినోద్‌ కూడా మునిగిపోతుండగా సాయితేజ అతడిని అతి కష్టమ్మీద కాపాడి ఒడ్డుకు చేర్చాడు. వెంటనే ఇరువురూ గ్రామంలోకి పరుగుపెట్టి విషయం స్థానికులకు చేరవేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశామని వివరించారు.

తల్లిదండ్రులకు ఏకైక సంతానం : మృతులు ముగ్గురూ వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో ఆయా కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. పిల్లలను కోల్పోవడంతో వారు రోదించిన తీరు అక్కడివారిని కన్నీరు పెట్టించింది. ఒకేరోజు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో విషాదం నెలకొంది. దీనిపై మృతులు తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుధీర్‌రావు పేర్కొన్నారు.

నలుగురిని మింగిన ఈత సరదా.. మునిగిపోయి ఇద్దరు, కాపాడబోయి మరో ఇద్దరు

వేసవి కాలం కావడంతో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో వారిపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు అంటున్నారు. స్నేహితులతో కలిసి పొలం గట్ల వెంబడి, చెరువులు, కుంటల్లోకి వెళ్లి సరదాగా గడపాలని చూస్తారని చెబుతున్నారు. పొలం దగ్గర చెట్లు ఎక్కి కిందపడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే చెరువులు, కుంటల్లో ఈత కొట్టడానికి వెళ్లి లోతు తెలియక, ఈత రాక మృత్యువాత పడతున్నారని అంటున్నారు. అందుకే చిన్నారులు ఎవరితో ఆడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని గమనించి తగు సలహాలు, సూచనలు చేయాలని కోరుతున్నారు.

Young Persons Dead in Pond Near Kowkur Dargah : చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి.. మృతదేహం కోసం గాలింపు చర్యలు

Man drowned at Hayatnagar : బావిలో ఈతకు దిగి వ్యక్తి మృతి.. మొబైల్​లో రికార్డయిన దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.