ETV Bharat / state

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ - భద్రాద్రిలో సీతారాముల శోభాయాత్ర

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 2:14 PM IST

Seetharamula Shobha Yatra In Bhadradri Temple : అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేళ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రాద్రిలో లక్ష్మణ సమేత సీతారాముల శోభాయాత్ర వైభవంగా జరిగింది. మామిడి తోరణాలు వివిధ రకాల పుష్పాలతో భద్రాద్రి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయంలోని స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, నిత్య కల్యాణ మండపం వద్ద బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు.

Prana Pratishta Pooja in Bhadradri Temple
Badradri Sri Rama Shobha Yatra

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ - భద్రాద్రిలో సీతారాముల శోభాయాత్ర

Seetharamula Shobha Yatra In Bhadradri Temple : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రిలో లక్ష్మణ సమేత సీతారాముల శోభాయాత్ర వైభవంగా జరిగింది. మామిడి తోరణాలు వివిధ రకాల పుష్పాలతో భద్రాద్రి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయంలోని స్వామివారికి విశేష పూజలు నిర్వహించి నిత్య కల్యాణ మండపం వద్ద బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు.

అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ- రామాలయానికి విచ్చేసిన అమితాబ్, రజనీకాంత్​ సహా ప్రముఖులు

చిన్నారుల కూచిపూడి నృత్యాలు, మహిళల కోలాటాల సందడి, మంగళ వాద్యాలు, వేద మంత్రాలు రామరథంతో సీతారాముల శోభాయాత్ర భద్రాద్రి పురవీధుల్లో ఘనంగా జరుగుతోంది. అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భద్రాచలంలోని ప్రధాన ఆలయం నుంచి బయలుదేరిన సీతారాములు బ్రిడ్జి సెంటర్ అంబేడ్కర్ సెంటర్ తాత గుడి సెంటర్ రాజు వీధుల గుండా శోభాయాత్ర సాగింది. భద్రాద్రి ఆలయ ప్రాంగణం మొత్తం కాషాయ జెండాలు రామనామ భక్త సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది.

Pran Pratishtha Celebrations Khammam : మరోవైపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలోని పురాతన శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమీప గ్రామమైన మధిరలోని ఈ ఆలయం నిర్మించి వందేళ్ళకు పైబడింది. ఇక్కడ ఆలయంలో స్వామిని దర్శించుకుంటే భద్రాద్రి రామయ్యను, అయోధ్య రామయ్యను దర్శించుకున్నట్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయోధ్య మందిర ప్రారంభ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. అయోధ్యలో జరిగే కార్యక్రమం భక్తులు వీక్షించేందుకు ఆలయంలో ప్రత్యేకంగా ఎల్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేశారు.

రామమందిరంతోపాటు అయోధ్యలో ముఖ్య ఆలయాలివే- తప్పక దర్శించుకోండి!

Ayodhya Ram Mandir Pran Pratishtha : 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అయోధ్య రామమందిరం కలసాకారమైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమవ్వగా 12.29 గంటలకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. కోట్లాది మంది ప్రజల ప్రత్యక్ష, పరోక్ష వీక్షణ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించారు. అలానే దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొన్నారు.

రామమందిరంతోపాటు అయోధ్యలో ముఖ్య ఆలయాలివే- తప్పక దర్శించుకోండి!

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ- అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.