ETV Bharat / state

ఆన్​లైన్​ గేమ్స్​కు బానిస అవుతున్న ప్రజలు - ఆడేందుకు అడ్డదారులు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 2:32 PM IST

Online Game Fraud in Telangana : 'ఆన్​లైన్​లో సరదాగా ఆడండి- డబ్బులు గెలవండి' ఇలాంటి లింకులు మీకు ఎప్పుడైనా కనిపించాయా? అయితే జాగ్రత్తగా ఉండాలి మరి. ఎందుకంటే తెలియకుండానే ఆన్​లైన్​ గేమింగ్​ టాస్క్​ల మోజులో పడి కొంత మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎంతలా అంటే డబ్బు కోసం దొంగతనం చేయడానికి కూడా వెనకాడడం లేదు. అంతలా వారు ఆన్​లైన్ గేమ్స్​కు బానిసలవుతున్నారు. అసలు బాధితులు ఎలా నగదు పోగొట్టుకుంటున్నారో తెలుసుకుందామా?

Youth Attract Online Game
Online Game Fraud in Telangana

Online Game Fraud in Telangana : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ఫోన్ ఉండటం​ కామన్​ అయిపోయింది. ఖాళీ సమయాల్లో ఏం చేయాలో తెలియక మొబైల్​తోనే ఎక్కువగా గడుపుతున్నారు. మనం సరదాకి ఏదైనా రీల్స్​ చూసినా, వెబ్​సైట్​లు సెర్చ్​ చేసినా కొన్ని యాడ్స్​ రూపంలో గేమింగ్​ ప్లాట్​ఫామ్​లు కనిపిస్తాయి. మరికొన్ని వెబ్​సైట్​ల మాదిరిగా, యాప్​లుగా ప్రత్యక్షమవుతాయి.

మనల్ని ఆకర్షించడానికి సరదాగా గేమ్​ అడుతూ డబ్బులు సంపాదించుకోండి, గెలిచిన డబ్బును క్షణాల్లోనే నేరుగా మీ ఎకౌంట్​లోకి నగదు చేరుతుందని వస్తుంటాయి. వీటిని చూసి ఆ సమయంలో కొంతమంది గేమ్​ ఆడడం మొదలు పెడుతున్నారు. ఆ గేమ్​ ఆడుతున్న మధ్యలో మరింత రసవత్తరంగా ఉండేందుకు టాస్క్​ల పేరుతో సైబర్​ నేరగాళ్లు యూజర్స్​కు వల వేస్తుంటారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది.

Cyber Criminals Attract People to Online Game : సరదాగా ఆడిన గేమ్​ కాస్త టాస్క్​(Attract Online Game Tasks)ల మోజులో పడి సైబర్ నేరగాళ్లు మనీ అడిగితే ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు కొందరు. దీంతో చివరికి కోట్లల్లో, లక్షల్లో డబ్బుల పోగొట్టుకుని మోసపోతున్నారు. వీరిలో పాఠశాల విద్యార్థుల నుంచి గృహిణుల వరకు ఎక్కువగా మోసపోతున్నారు. ఎంతగా అవగాహన కల్పించినా ఇలాంటి కేసులు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదని పోలీసులు చెబుతున్నారు.

పెరుగుతున్న ఆన్​లైన్​ గేమింగ్​ మోసాలు - ఖాతాల్లో సొమ్ము కొల్లగొడుతున్న కేటుగాళ్లు

హైదరాబాద్​ నగర పరిధిలో గడిచిన 20 రోజుల్లోనే సైబర్​ నేరస్థుల చేతిలో సుమారు రూ.10 కోట్లు నష్టపోయారు. వీరిలో ఆన్​లైన్ గేమ్స్​ బాధితులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కార్పొరేట్​ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పని చేసే ప్రదేశాల్లో పోలీసులు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్​ మీడియా వేధికగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇన్ని చేసినా ఏదో ఒక రూపంలో మోసపోయే బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఆటకు బానిసలైన కొందరు గేమ్స్‌ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నేరస్థులుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నారు.

డ్రీమ్​ 11లో రూ.కోటి జాక్​పాట్​.. ఫుల్లుగా మందుకొట్టి హల్​చల్​.. అఖరికి

100 Crore Fraud Due to Online Gaming : ఇటీవల గేమింగ్​ వెబ్​సైట్(Cyber Fraud by Online Gaming Website)​ ద్వారా ఓ బాధితురాలు రూ.70 లక్షలు పోగొట్టుకుంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న రక్షకభటులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో భాగంగా విదేశాల్లోని సైబర్​ నేరస్థులకు బ్యాంకు ఖాతాలు అందజేస్తున్న నిందితుడు హితేష్​గోయల్​ను అదుపులోకి తీసుకుని అరెస్ట్​ చేశారు. ఆ ఒక్క గేమింగ్​ వెబ్​పోర్టల్​ ద్వారా దేశవ్యాప్తంగా 200 మంది రూ.100 కోట్ల వరకు నష్టపోయారని పోలీసులు తెలిపారు.

Woman Attract Online Game Loss Money in Hyderabad : మరో కేసులో భాగ్యనగరానికి చెందిని గృహిణి రూ.21 లక్షలు మోసపోయింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసైన నగరానికి చెందిన మహిళ డబ్బు కోసం వాహనదారులను లిఫ్ట్‌ అడిగి ఇవ్వకపోతే తనపై అత్యాచారం చేశారని కేసు పెడతానని భయపెట్టి వారి నుంచి డబ్బులు లాక్కునేది. అలా తన చేతికి వచ్చిన డబ్బును గేమింగ్ యాప్స్​ కోసం వినియోగించేది.

Dream11 One Crore Winner : డ్రీమ్11లో రూ.కోటిన్నర గెలిచిన SI సస్పెండ్​.. షాక్​ ఇచ్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

Online Gaming Addiction : తల్లీబిడ్డల ప్రాణాలను తీసిన.. ఆన్​లైన్ గేమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.