ETV Bharat / state

పెరుగుతున్న ఆన్​లైన్​ గేమింగ్​ మోసాలు - ఖాతాల్లో సొమ్ము కొల్లగొడుతున్న కేటుగాళ్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 11:52 AM IST

Online Gaming Frauds Hyderabad : ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా కొందరు కేటుగాళ్లు పలువురి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము కొల్లగొడుతున్నారు. గేమింగ్‌ ద్వారా భారీగా సంపాదించవచ్చని ఆకర్షనీయమైన లింకులు చూసి కొందరు గేమ్‌లు ఆడి నిలువునా మోసపోతున్నారు. మహిళలు, విద్యార్ధులు సైతం బాధితుల్లో ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 20 రోజుల్లో సైబర్‌ నేరగాళ్ల చేతిలో సుమారు 10 కోట్ల మంది బాధితులు మోసపోయారంటే పరిస్థితి ఊహించవచ్చు. ఆన్‌లైన్‌ గేమింగ్‌కు అలవాటు పడిన వారు అడ్డదారులు తొక్కుతూ నేరస్థులుగా మారుతున్నారు.

Online Gaming Becoming Dangerous
Online Gaming

Online Gaming Frauds Hyderabad : నేడు సైబర్‌ నేరగాళ్లు వివిధ మార్గాలను అన్వేషిస్తూ మోసం చేయడానికి వెనకాడడంలేదు. అందులోను సులభంగా డబ్బును సంపాదించవచ్చని ఆశ చూపుతున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా వల విసిరి పలువురి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును దోచేస్తున్నారు. ఈ నేరాల్లో మహిళలు, విద్యార్ధులు బాధితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 20 రోజుల్లో సైబర్‌ నేరగాళ్ల చేతిలో సుమారు 10 కోట్ల మంది బాధితులు మోసపోయారంటే పరిస్థితి ఊహించవచ్చు. వీటి కారణంగా బాధితులైన అమాయకలు నేరస్థులుగా మారుతున్నారు.

ఓ గేమింగ్‌ వైబ్‌సైట్‌ ద్వారా దేశంలో 2 వందల మంది వంద కోట్ల రూపాయలు పోగొట్టకున్నట్టు సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. ఇటీవల గేమింగ్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా 70 లక్షలు కోల్పోయినట్టు బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విచారణ అనంతరం సైబర్‌ నేరస్థులకు బ్యాంకు ఖాతాలు అందజేస్తున్న నిందితుడు హితేష్‌గోయల్‌ను అరెస్టు చేశారు. ఇటీవల 4 వందలకు పైగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌లు, వివిధ వెబ్‌సైట్ల ద్వారా భారీ మోసాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Tips to Quit Online gaming : ఆన్‌లైన్‌ గేమింగ్​ వ్యసనం నుంచి బయపడాలా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే

Online Apps Frauds Hyderabad : నగరానికి చెందిన ఓ గృహిణి ఇళ్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకు నుంచి 21 లక్షల రూపాయల రుణం తీసుకుంది. అధిక సొమ్ములు వస్తాయని ఆన్‌లైన్‌ గేమింగ్‌లో సర్వం కోల్పోయింది. మరో మహిళ ఈ గేమింగ్‌కు బానిసగా మారి ఆడేందుకు డబ్బులు లేక నేరస్తురాలిగా మారింది. ఇవేకాక అగంతకులు అనేక మార్గాలను ఎంచుకొని నేరాలు చేస్తున్నారు. నేరస్థుల్లో మహిళలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

మరో వ్యవహారంలో సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌కు అలవాటు పడి చోరీలు చేశాడు. మూడు నెలల్లో 12 దొంగతనాలు చేశాడు. చోరీ చేసిన నగలను ఫైనాన్స్‌ సంస్థల్లో తాకట్టు పెట్టి.. గేమ్‌లు ఆడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో చోట ఓ కార్పొరేట్‌ బ్యాంకు ఉద్యోగిగా ఉండి ఖాతాదారుల డబ్బు తస్కరించి ఆట ఆడి సొమ్ము కోల్పోయాడని సమాచారం. ఇవే కాక రోజురోజుకు దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసులు అధికమవుతున్నాయి. ఇప్పటికైనా వినియోగదారులు ఏది నిజమో, కాదో గ్రహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆకర్షనీయమైన ప్రకటనలు చేసి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా వైబ్‌సైట్లు, యాప్‌లకు దూరంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

Online Betting Games : ఆశతో ఆన్​లైన్ బెట్టింగులు.. అప్పుల కుప్పల్లో జీవితాలు

Online Gaming Cyber Crime : మనవడి ఆటతో తాతకు రూ. 11.5 లక్షలు నష్టం!

పోయిన చోటే రాబట్టుకోవాలని.. రూ.87లక్షలు కోల్పోయాడు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.