ETV Bharat / bharat

Dream11 One Crore Winner : డ్రీమ్11లో రూ.కోటిన్నర గెలిచిన SI సస్పెండ్​.. షాక్​ ఇచ్చిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 1:52 PM IST

Updated : Oct 18, 2023, 2:24 PM IST

Dream11 One Crore Winner : రాత్రికిరాత్రే రూ.కోటిన్నర గెలుచుకున్న మహారాష్ట్రకు చెందిన సబ్​ ఇన్​స్పెక్టర్ సస్పెన్షన్​కు గురయ్యారు. నిబంధనలకు అతిక్రమణ, పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ విధుల్లో నుంచి తొలగించింది పోలీస్ శాఖ.

Dream11 One Crore Winner
Dream11 One Crore Winner

Dream11 One Crore Winner : ఆన్​లైన్ బెట్టింగ్​ యాప్​ డ్రీమ్​ 11లో రూ. కోటిన్నర గెలుచుకున్న ఎస్​ఐ సోమ్​నాథ్​ జెండే సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు అతిక్రమించి పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ చర్యలకు ఉపక్రమించారు అధికారులు. ఈ మేరకు ఆయనను విధుల్లో నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్​ మానే ధ్రువీకరించారు. కోటిన్నర గెలుచుకుని వార్తల్లో నిలిచిన ఆయన.. సస్పెండ్ అయ్యి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

Dream11 One Crore Winner
భార్యతో ఎస్​ఐ సోమ్​నాథ్ జెండే

అక్టోబర్​ 10న విధుల్లో ఉండి.. ఇంగ్లాండ్​-బంగ్లాదేశ్​ మ్యాచ్​పై బెట్టింగ్​లో పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు. దీంట్లో ప్రథమ స్థానంలో నిలిచిన సోమ్​నాథ్​.. రూ.కోటిన్నర గెలుచుకున్నారు. పోలీసులే బెట్టింగ్​కు పాల్పడడం వల్ల వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన పోలీసు శాఖ.. విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తి చేసిన అధికారులు.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి శాఖపరమైన విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు.

Dream11 One Crore Winner
ఎస్​ఐ సోమ్​నాథ్ జెండే

అసలేం జరిగిందంటే?
1 Crore Winner In Dream11 : మహారాష్ట్రలోని పింప్రి చించ్​వాడ్​ పోలీస్​ కమిషనరేట్​కు చెందిన సోమ్​నాథ్​ జెండే.. డ్రీమ్ ​11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. మూడు నెలలుగా సోమ్​నాథ్​ డ్రీమ్​ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, భారత్​ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్​లో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లాండ్​- బంగ్లాదేశ్ మ్యాచ్​లో సోమ్​నాథ్​ బెట్టింగ్​ వేశారు. మ్యాచ్​లో ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే టీమ్​ను ఎంపిక చేసుకున్న ఆయన.. ఫాంటసీ గేమ్​లో అగ్రస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

"కొన్ని నెలలుగా డ్రీమ్​ 11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. ఇంతవరకు సక్సెస్​ కాలేకపోయాను. మంగళవారం కూడా డ్రీమ్ ​11 టీమ్​ను ఎంచుకున్నాను. ఆ తర్వాత నా టీమ్​లో టాప్​లోకి వచ్చింది. వెంటనే రూ.1.5 కోట్ల గెలుచుకున్నట్లు మెసేజ్​ వచ్చింది. మొదట దానిని నమ్మలేదు. తర్వాత నమ్మాను. మొత్తానికి చాలా సంతోషంగా ఉంది" అని సోమ్​నాథ్ జెండే తెలిపారు.

నిన్నటి వరకు అతి సామాన్యుడు​.. డ్రీమ్​11తో ఒక్కసారిగా లైఫ్​ టర్న్.. రూ.కోటి జాక్​పాట్​!

రూ.49తో 'డ్రీమ్​11'లో బెట్టింగ్.. DJ వర్కర్​కు రూ.కోటి జాక్​పాట్​..

Last Updated : Oct 18, 2023, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.