ETV Bharat / bharat

నిన్నటి వరకు అతి సామాన్యుడు​.. డ్రీమ్​11తో ఒక్కసారిగా లైఫ్​ టర్న్.. రూ.కోటి జాక్​పాట్​!

author img

By

Published : Mar 22, 2023, 4:46 PM IST

Updated : Mar 22, 2023, 5:35 PM IST

పొట్టకూటి కోసం సొంత ప్రాంతాన్ని వదిలి వేరే రాష్ట్రానికి వలస వెళ్లిన ఓ యువకుడిని అదృష్టం వరించింది. దాదాపు ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న అతడి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. డ్రీమ్​11 అనే క్రికెట్​ గేమింగ్​ యాప్​తో రాత్రికిరాత్రే లక్షాధికారిగా మారిపోయాడు ఆ యువకుడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..

outh won crore in dream 11 in himachal pradesh
డ్రీమ్​11 యాప్​ ద్వారా లక్షాధికారిగా మారిన ఝార్ఖండ్ యువకుడు

డ్రీమ్​11 అనే క్రికెట్​ గేమింగ్​ యాప్​తో రాత్రికిరాత్రే లక్షాధికారి అయ్యాడు ఓ సామాన్య యువకుడు. దాదాపు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న అతడి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
ఝార్ఖండ్​కు చెందిన సుశీల్​ కుమార్​ అనే యువకుడు జీవనోపాధి కోసం 15 ఏళ్ల క్రితం హిమాచల్​ ప్రదేశ్​ చంబా జిల్లాలోని పాంగి ప్రాంతానికి వలస వెళ్లాడు. అక్కడి రాష్ట్ర విద్యుత్తు బోర్డులో నాల్గో తరగతి ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడి సోదరుడితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే సుశీల్​ కుమార్​ గత ఒకటిన్నర సంవత్సరాలుగా డ్రీమ్​11 క్రికెట్​ గేమింగ్​ యాప్​లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి చిన్న మొత్తంలో మాత్రమే డబ్బులు వచ్చేవి.

కానీ, తాజాగా ఆడిన గేమ్​లో సుశీల్​ కుమార్ అక్షరాలా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. తాను ఈ పెద్ద మొత్తం గెలిచేకన్నా ముందు ఆ సమయంలో సుమారు 35 లక్షల మంది ఈ ఆటను ఆడుతున్నారని సుశీల్​ చెప్పాడు. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఎవరు గెలుస్తారో అని కచ్చితమైన అంచనా వేయడం ద్వారానే ఇంత భారీ మొత్తాన్ని గెలుచుకున్నట్లుగా సుశీల్​ తెలిపాడు.

ఆన్​లైన్​ గేమ్​లో గెలిచిన సొమ్మును తన తల్లిదండ్రులకు అందజేస్తానని సుశీల్​ కుమార్​ చెప్పాడు. ఇకపోతే వచ్చిన రూ.కోటి నగదు బహుమతిలో పన్ను మినహాయింపులు పోగా సుశీల్​ చేతికి రూ.70 లక్షలు అందుతాయి. ఇంతకుముందు కూడా డ్రీమ్11 గేమింగ్​ యాప్​ ద్వారా హిమాచల్​ ప్రదేశ్​లో కొందరు ఇదే తరహాలో లక్షాధికారులు అయ్యారు.

డ్రీమ్​11లో వచ్చిన రూ.2కోట్లతో.. ఏం చేశాడో తెలుసా..?
గతేడాది మే నెలలో కూడా జమ్ముకశ్మీర్​కు చెందిన ఓ యువకుడు ఈ డ్రీమ్11 క్రికెట్​ గేమింగ్​ యాప్​ ద్వారా ఏకంగా రూ.2 కోట్లను గెలుపొందాడు. అతడు ఎంచుకున్న టీమ్​ నెగ్గడం ద్వారా ఇంత భారీ మొత్తాన్ని అతడు గెలుచుకున్నాడు. అయితే గెలిచిన ఈ సొమ్ముతో ఆ వ్యక్తి ఏం చేశాడో తెలియాలంటే ఈ లింక్​ను క్లిక్​ చేయండి.

బెట్టింగులతో జాగ్రత్త సుమీ..
అయితే జూదం, బెట్టింగ్​ వంటి పోకడలకు పోతే చివరకు అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. ఒక్కసారి వీటికి అలవాటైతే గనుక ఈ ఉచ్చులో నుంచి బయట పడటం మాత్రం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో డబ్బుపై వ్యామోహంతో పందేల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. హైదరాబాద్​ సహా ఇతర నగరాల్లో కూడా ఈ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోతోంది. బెట్టింగుల్లో నష్టపోయిన యువత ఎంతటి మోసాలకైనా పాల్పడి తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Last Updated : Mar 22, 2023, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.