ETV Bharat / bharat

రూ.49తో 'డ్రీమ్​11'లో బెట్టింగ్.. DJ వర్కర్​కు రూ.కోటి జాక్​పాట్​..

author img

By

Published : Dec 31, 2022, 10:47 AM IST

Dream 11 Crore Win: డ్రీమ్ 11... చాలా మందికి తెలిసిన పేరే. ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. తమ అంచనాల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తొలిస్థానంలో నిలిచి జాక్​పాట్ కొట్టాలని భావిస్తుంటారు. కానీ, అతికొద్ది మందికే అలాంటి అవకాశం లభిస్తుంటుంది. ఈ కోవకు చెందిన ఓ డీజే వర్కర్​ రాత్రిరాత్రే రూ.కోటి కొల్లగొట్టాడు.

Dream 11 crore win
Dream 11 crore win

Dream 11 crore win: ఫాంటసీ క్రికెట్ గేమ్​లో జాక్​పాట్ కొట్టాడు బిహార్​ వాసి. డ్రీమ్​ 11 యాప్​లో ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాడు. నవాడ.. పిప్రా గ్రామానికి చెందిన రాజు రామ్​ గత ఏడాదిన్నరగా డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా బ్రిస్బేన్ హీట్ వర్సెస్​ సిడ్నీ థండర్ మ్యాచ్​లో రూ.49 పెట్టి ఫాంటసీ గేమ్ ఆడాడు. మ్యాచ్​లో ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే టీమ్​ను ఎంపిక చేసుకున్న అతడు.. ఫాంటసీ గేమ్​లో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో రూ.కోటి గెలుచుకున్నాడు.

Dream 11 crore win
డ్రీమ్​ 11లో రూ.కోటి గెలుచుకున్న రాజురామ్​

ఈ విషయం తెలుసుకున్న రాజురామ్​ కుటుంబ సభ్యులు ముందు నమ్మలేదు. గెలుచుకున్న మొత్తంలో పన్ను తీసివేయగా.. రూ.70 లక్షలు అతడి ఖాతాలో జమయ్యాయి. అప్పుడే అంతా నమ్మారు. డ్రీమ్​11లో గెలుచుకున్న సొమ్మును వ్యాపారం కోసం ఉపయోగిస్తానని రాజురామ్​ తెలిపాడు. తాను ఇప్పటి వరకు కొంతమొత్తం గెలుచుకున్నానని.. ఇప్పుడు రూ.75 లక్షలు సంపాదించడం సంతోషంగా ఉందని చెప్పాడు.

Dream 11 crore win
డ్రీమ్​ 11లో రూ.కోటి గెలుచుకున్న రాజురామ్​
Dream 11 crore win
రాజు రామ్​ కుటుంబం

అయితే డ్రీమ్​ 11లో బెట్టింగ్​ పెట్టి విద్యార్థులు, డ్రైవర్లు, ప్లంబర్లు.. ఇలా చాలా మంది పెద్ద మొత్తంలో సొమ్మును గెలుచుకున్నారు. వాటిలో కొందరి గురించి మీకోసం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.