ETV Bharat / state

సమ్మక్క సారలమ్మ జాతరలో గిరిజన మ్యూజియం - వారి జీవన విధానాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 3:16 PM IST

Medaram Sammakka Sarakka Tribal Museum : అభయారణ్యంలో అంగరంగ వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతరకు కోటి మందికిపైగా భక్తులు తరలిరానున్నారు. జాతరకు వచ్చే భక్త జనానికి వనదేవతల చరిత్రతో పాటు గిరిజనుల జీవన విధానాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలను గిరిజనేతర్లకు తెలియజేసేందుకు గిరిజన మ్యూజియానికి రూ.16 లక్షలు వెచ్చించి అందంగా తీర్చిదిద్దారు. జాతరకు వచ్చే భక్తులను ఈ మ్యూజియం ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Medaram Jatara 2024
Medaram Sammakka Sarakka Tribal Museum

సమ్మక్క సారలమ్మ జాతరలో గిరిజన మ్యూజియం వారి జీవన విధానాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే ప్లాన్

Medaram Sammakka Sarakka Tribal Museum : సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతుండటంతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు పయనమవుతున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని బంగారాన్ని కానుకగా సమర్పించి మనసారా మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారంలో అత్యంత సుందరంగా నిర్మించిన గిరిజన మ్యూజియం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

"మా పిల్లలను తీసుకుని వచ్చాము. వాళ్లకు సమ్మక సారలమ్మ చరిత్ర గురించి ఏమీ తెలియదు. అప్పట్లో గిరిజనులు వాడిన వస్తువులు, బుట్టలు వంటివి ఎలా తయారు చేశారు అన్ని చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. మనం రోజు వాడే వస్తువులకన్నా ఇవి భిన్నంగా ఉండటంతో ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. వారు ఆ వస్తువులు ఎలా వాడేవారో అన్న అంశాలని గమనిస్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మ్యూజియం చూశాను. సమ్మక్క సారలమ్మ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. అప్పట్లో వాడిన పాతవస్తువులన్నీ చూశాను. బుట్టలు మొదలైనవన్నీ చూశాను వాటి గురించి తెలుసుకున్నాను." - సందర్శకులు

మేడారం భక్తులకు గుడ్​న్యూస్​ - అరచేతిలో 'జాతర' సమాచారం! - యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారా?

Medaram Jatara 2024 : మేడారం అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రత్యేక అలంకరణ, పనుల కోసం మ్యూజియం భవనానికి రూ.16 లక్షలు వెచ్చించి అందంగా తయారుచేశారు. ఈ ప్రదర్శనశాలలో కోయల సంస్కృతీ సంప్రదాయాలు, వనదేవతల చరిత్ర కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. గిరిజనులు ఉపయోగించిన పనిముట్లు, వంట సామాగ్రి, మిగతా వస్తువులన్నీ మరింతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీల జీవనశైలి ఉట్టిపడేలా ఉన్న దృశ్యాలు, సమ్మక్క సారలమ్మల పుట్టుక నుంచి మొదలుకొని వనప్రవేశం వరకు ఏర్పాటు చేసిన చిత్రాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.

"2018లో ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం జరిగింది. జాతర జాతరకు దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. రానున్న జాతరలో కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. గతంలో అనుకున్న మాదిరి ఒక వస్తువు గురించి సమాచారాన్ని డిజిటల్​ రూపంలో చూపిండం జరుగుతుంది. గతంలో గిరిజనులు వాడిన వస్తువులన్నీ సేకరించి వాటిని మ్యూజియంలో ఏర్పాటు చేశాం." - కురుసం రవి, మ్యూజియం అధికారి

'బండెనక బండి కట్టి - పదహారు బండ్లు కట్టి' - ఊరుఊరంతా మేడారం జాతరకు

ఈ మ్యూజియంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, యాంపీ థియేటర్ ఫ్లోరింగ్, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాల కల్పించారు. మ్యూజియం ఆవరణలో గతంలో నిర్మించిన కోయ గ్రామాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో ఆదివాసీల ఆహారపు ఉత్పత్తులు అందుబాటులో ఉంచడం సహా వాటిని సందర్శకులకు రుచి చూపించనున్నారు. ఆధునిక కాలంలో అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయాలను మరలా ప్రజలకు తెలియజేసేందుకు ఈ గిరిజన మ్యూజియం ఎంతగానో ఉపయోగపడుతుందని భక్తులు చెబుతున్నారు.

ఆదివాసీ జాతరకు ఘనంగా ఏర్పాట్లు - వన దేవతల చెంత, సౌకర్యాలకు ఈసారి నో చింత

వనమంతా జనమయ్యే వేళాయే - నేటి నుంచి మేడారం మహా జాతర షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.