ETV Bharat / state

ఆన్​లైన్ గేమ్స్ కోసం ఇంట్లో నగలు చోరీ - దొంగలు ఎత్తుకెళ్లారని కట్టుకథ - చివరి ట్విస్ట్ మాత్రం అదుర్స్! - Online Games Crime

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 7:40 AM IST

Hyderabad Young Lady Loss Money in Online Game
Hyderabad Young Lady Loss Money in Online Game

Hyderabad Young Lady Lost Money in Online Game : ఆన్​లైన్​ గేమ్​లకు అలవాటు పడిన ఓ యువతి సైబర్​ దాడికి గురైంది. ఆన్​లైన్ గేమ్స్ కోసం ఏకంగా ఇంట్లో నగలు అమ్మేసి పెట్టుబడి పెట్టింది. మోసపోవడంతో చివరికి కట్టుకథ అల్లి పోలీసులను బురిడీ కొట్టించాలని చూసింది. కానీ చివరకు దొరికేసింది.

Hyderabad Young Lady Lost Money in Online Game : ఇప్పుడున్న యువత పుస్తకాలు, ఆటలు మానేసి ఎంచక్కా సెల్​ఫోన్​లో సామాజిక మాధ్యమాలు, గేమ్​లు అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్​లైన్​ గేమ్(Online Game Fraud)​లలో పడి సైబర్​ నేరాల బారిన పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అదే క్రమంలో సైబర్​ మోసానికి బలై లక్షల్లోనూ, వేలల్లోనూ డబ్బులు పోగొట్టుకుంటున్న అభాగ్యులు ఉన్నారు. తాజాగా హైదరాబాద్​లోని రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆన్​లైన్​ గేమ్​లకు అలవాటు పడిన ఓ యువతి నగదు పోగొట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి చాకచక్యంగా ఆ యువతే అని గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : నగరంలోని రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఎర్రబోడలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ యువతి ఆన్​లైన్​ గేమ్స్​కు అలవాటు పడింది. గేమ్​ ఆడుతుండగా అందులో కొంత జమచేస్తే ఎక్కువ మొత్తం వస్తాయని అలర్ట్​ వచ్చింది. ఎప్పటి నుంచో గేమ్స్ ఆడుతున్న ఆ యువతి అది నిజమేనేమోనని నమ్మి అందులో ముందుగా రూ.200 పంపించింది. అప్పుడు రూ.600లు వచ్చాయి.

చాలా సంతోషించిన ఆ యువతి ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. దీంతో ఆమె వేలల్లో అందులో జమ చేసింది. అలా రూ.30 వేలు వరకు జమ చేసిన తర్వాత నగదు తిరిగి రాలేదు. అంతటితో ఆగకుండా ఆ డబ్బెలాగైనా సంపాదించాలని ఇంట్లో ఉన్న కొద్దీ బంగారం విక్రయించి మరో రూ.35 వేల వరకు ఆ ఆన్​లైన్​ గేమింగ్​లో పెట్టింది. ఆ తర్వాత యువతి పెట్టిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవడంతో సైబర్​ దాడిలో(Cyber Fraud in Hyderabad) మోసపోయానని గ్రహించింది.

ఆ​ యాప్​పై సైబర్​ దాడి​- హ్యాకర్ల చేతికి 70 లక్షల మంది వివరాలు!

Online Game Fraud in Hyderabad : ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక అయోమయంలో పడింది. అదే బస్తీలో ఇటీవల ఇద్దరు ముసుగు దొంగలు హల్​చల్​ చేయడం గుర్తించింది. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని ఆ యువతి ఒక కట్టుకథ అల్లింది. గురువారం ఉదయం ఇంట్లో బీరువాలోని సామగ్రిని చిందరవందరగా పడేసింది. తాను బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఇద్దరు ముసుగు దొంగలు ప్రవేశించారని గట్టిగా అరిచి స్థానికులను పిలిచింది.

స్థానికులు వచ్చాక దొంగలు పారిపోయినట్లు ఆ యువతి స్థానికులతో చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు వారు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కేసును పోలీసులు చాలా సీరియస్​గా తీసుకుని వేగంగా స్పందించారు. ఆ యువతిని పూర్తి వివరాలు అడుగుతున్న క్రమంలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. అప్పుడు అది అంతా తాను అల్లిన కట్టుకథ అంటూ పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కు అయ్యారు.

సెర్చ్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా?.. ఈ టిప్స్​ ఫాలో అవ్వకపోతే మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ!

ఆన్​లైన్​ రుణయాప్​ల కేసులో ఐదుగురు అరెస్టు.. కీలక సమాచారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.