ఆ​ యాప్​పై సైబర్​ దాడి​- హ్యాకర్ల చేతికి 70 లక్షల మంది వివరాలు!

author img

By

Published : Nov 9, 2021, 1:41 PM IST

robinhood news

సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సైబర్​ దాడులు ఆగడం లేదు. తాజాగా ఓ ప్రముఖ స్టాక్​ ట్రేడింగ్​ యాప్ (Robinhood News)​ సైబర్​ దాడికి గురైంది . 50 లక్షల మంది కస్టమర్ల ఈమెయిల్స్​తో పాటు పలువురి వ్యక్తిగత సమాచారాన్ని కూడా హ్యాకర్లు తస్కరించినట్లు సంబంధిత సంస్థ వెల్లడించింది.

అమెరికాకు చెందిన స్టాక్​ ట్రేడింగ్ యాప్​ రాబిన్​హుడ్​పై (Robinhood News) సైబర్​ నేరగాళ్లు దాడికి పాల్పడ్డారు. ఈనెల 3న జరిగిన ఈ ఘటనలో 50 లక్షల మంది కస్టమర్ల ఈమెయిల్స్​తో పాటు సంస్థలో పెట్టుబడులు పెట్టిన మరో 20 లక్షల మంది పేర్లు కూడా హ్యాకర్ల సేకరించినట్లు రాబిన్​హుడ్​ సంస్థ (Robinhood News) చీఫ్​ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్​ఓ)​ క్యాలెబ్​ సీమా వెల్లడించారు. వీరిలో 310 యూజర్ల వ్యక్తిగత వివరాలు కూడా హ్యాకర్ల చేతికి వెళ్లినట్లు తెలిపారు.

ఎలాంటి నష్టం లేదు..

ఈ దాడి వల్ల ఎవరికీ ఎలాంటి ఆర్థిక నష్టం కలగలేదన్నారు రాబిన్​హుడ్​ సంస్థ (Robinhood News) సీఎస్​ఓ. బ్యాంక్​ ఖాతా​, సోషల్​ సెక్యూరిటీ నంబర్స్​, డెబిట్​ కార్డు వివరాలు గోప్యంగానే ఉన్నాయని స్పష్టం చేశారు.

రాబిన్​హుడ్​ ఉద్యోగిని నమ్మించి..

హ్యాకర్లు 'సోషల్​​ ఇంజినీరింగ్'​ అనే పద్ధతిని ఉపయోగించి తమ సంస్థపై సైబర్​ దాడికి పాల్పడినట్లు సీఎస్​ఓ వెల్లడించారు. తమ సంస్థ కస్టమర్​ కేర్​కు కాల్​ చేసిన నిందితులు.. రాబిన్​హుడ్​ సంస్థకు చెందిన అధికారిని అంటూ ఉద్యోగిని నమ్మించారని సీమా తెలిపారు. కస్టమర్​ సపోర్ట్​ కంప్యూటర్​ సిస్టమ్​ను హ్యాక్​ చేయడం ద్వారా నిందితులు వివరాలు సేకరించారని పేర్కొన్నారు.

అప్పటివరకు తెలియలేదు..

వివరాలు హ్యాక్​ చేసిన నిందితులు రాబిన్​హుడ్​ సంస్థను డబ్బులు డిమాండ్​ చేసేవరకు యాప్​ హ్యాక్​ అయినట్లు సంస్థకు తెలియకపోవడం గమనార్హం. నిందితుల డిమాండ్​తో అప్రమత్తమైన రాబిన్​హుడ్​.. పోలీసులకు ఫిర్యాదు చేయడం సహా కస్టమర్లను హెచ్చరించింది. తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని.. హ్యాక్​పై వినియోగదారులను హెచ్చరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీమా.

సేకరించిన సమాచారంతో అలా..

రాబిన్​హుడ్​ నుంచి సేకరించిన వివరాలతో నిందితులు కస్టమర్లపై 'పిషింగ్'​కు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి : ఈ వెబ్‌సైట్లు చూశారంటే.. ఔరా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.