ETV Bharat / state

ఎండా కాలంలో ఏసీ కరెంటు బిల్లు భారీగా వస్తోందా? - ఈ టిప్స్‌ పాటిస్తే సరి! - How To Reduce Current Bill

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 12:51 PM IST

How To Reduce AC Current Bill : సమ్మర్‌లో ఎండవేడి నుంచి తట్టుకోవడానికి రోజంతా ఏసీని ఉపయోగిస్తుంటారు చాలా మంది. అయితే.. ఏసీ వాడకం వల్ల వచ్చే కరెంటు బిల్లు చూస్తే.. ముఖం మాడిపోతుంది! మీరు కూడా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందని బాధపడుతున్నారా? అయితే.. మీ కోసమే కరెంట్‌బిల్లు తగ్గించే చిట్కాలను తీసుకొచ్చాం!

How To Reduce AC Current Bill
How To Reduce AC Current Bill

How To Reduce AC Current Bill : రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు కాకముందు నుంచే ఎండలు విజృంభిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో.. ఇంట్లో ఉన్నప్పటికీ వేడి, ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందడానికి ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువసేపు ఆన్‌ చేసి పెడుతున్నారు. ఇలా ఏసీని ఎక్కువసేపు ఆన్‌లో ఉంచితే కరెంటు బిల్లు భారీగా వస్తుంది. అయితే.. కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల చాలా వరకు కరెంట్‌ బిల్లును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ టెంపరేచర్ సెట్‌ చేయండి :
చాలా మందికి ఏసీని ఏ టెంపరేచర్ వద్ద సెట్‌ చేస్తే కరెంట్‌ బిల్లు తక్కువగా వస్తుందో తెలియకపోవచ్చు. అయితే.. ఏసీని 24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద సెట్‌ చేయడం వల్ల కరెంట్‌ బిల్లు ఎక్కువ రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 24 డిగ్రీల సెల్సియస్‌ నుంచి మీరు ఒక్కో డిగ్రీ టెంపరేచర్‌ తగ్గిస్తే కరెంట్‌ బిల్లు కూడా పెరుగుతుందని అంటున్నారు. కాబట్టి, ఏసీని ఎల్లప్పుడూ ఈ టెంపరేచర్ వద్ద సెట్‌ చేయండి.

సారీ! ఈసారి నో జీరో బిల్ - మొత్తం కట్టాల్సిందే - వినియోగదారులకు షాక్ - No Zero Current Bill in April 2024

ఫ్యాన్‌ ఆన్‌ చేయండి :
కొంత మంది ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు ఫ్యాన్‌ ఆఫ్‌ చేస్తుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల మనకు రూమ్‌ కూల్‌గా ఉన్నట్లు అనిపించదు. ఏసీతో పాటు ఫ్యాన్ ఉపయోగించడం వల్ల గాలి చల్లగా అనిపిస్తుంది. కాబట్టి, ఏసీ ఆన్‌లో ఉన్నా కూడా ఫ్యాన్‌ ఆన్‌ చేయండి.

ఫిల్టర్లు క్లీన్‌ చేయండి :
గాలిలో ఉండే దుమ్ము, ధూళి ఏసీలోని ఫిల్టర్లలో పేరుకుపోతుంది. ఈ డస్ట్ ఎక్కువగా ఉంటే.. ఏసీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తద్వారా మనం ఏసీ పాయింట్లు పెంచుతాం. ఫలితంగా కరెంట్‌ బిల్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులంటున్నారు. కాబట్టి.. ఏసీ ఫిల్టర్‌లను నెలకు ఒకసారి లేదా రెండుసార్లు క్లీన్‌ చేయాలని సూచిస్తున్నారు.

  • అలాగే.. ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు అన్నీ క్లోజ్‌ చేయండి. ఎందుకంటే ఏసీ గాలి బయటకు వెళ్లిపోతే రూమ్‌ చల్లగా అవ్వడానికి ఇంకా టైమ్‌ పడుతుంది.
  • కిటికీల నుంచి ఇంట్లోకి సూర్యరశ్మి రాకుండా కర్టెన్లు కట్టండి. దీనివల్ల రూమ్‌లోకి వచ్చే ఎండవేడిని తగ్గించవచ్చు.
  • ఇలా ఈ వేసవి కాలంలో ఏసీని ఉపయోగిస్తే చాలా వరకు కరెంట్‌ బిల్లు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. సో.. మీరు కూడా ఈ చిట్కాలు పాటించండి!

గ్రేటర్​లో ఆరో తేదీలోపు బిల్లులు జారీ చేయాలి - విద్యుత్​ సిబ్బందికి ఆదేశాలు - hyderabad zero current bills

కరెంటు బిల్లుతో హడలెత్తిన కరీంనగర్​ ప్రజలు - దరఖాస్తులతో మున్సిపల్​ కార్యాలయాలకు పరుగోపరుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.