ETV Bharat / state

సారీ! ఈసారి నో జీరో బిల్ - మొత్తం కట్టాల్సిందే - వినియోగదారులకు షాక్ - No Zero Current Bill in April 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 10:42 AM IST

Gruha Jyothi Scheme Zero Bill in Telangana : సారీ జీరో బిల్లు కాదు పూర్తి బిల్లు కట్టండి అంటూ విద్యుత్​ సంస్థలు మళ్లీ వినియోగదారులకు బిల్లును పంపించాయి. దీంతో గత నెల జీరో బిల్లు వచ్చిందని సంబురపడ్డ వినియోగదారులకు ఒక్కసారిగా షాక్​ కొట్టినట్లు అయింది. ఇంతకీ ఎందుకు డిస్కంలు అలా మాట్లాడుతున్నాయో తెలుసుకుందామా?

Gruha Jyothi Scheme Zero Bill in Telangana
Gruha Jyothi Scheme Zero Bill in Telangana

Gruha Jyothi Scheme Zero Bill in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో(Congress Six Guarantees) ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం ప్రారంభించి నెల రోజులు అయిన కాలేదు అప్పుడే ఎన్నికల కోడ్​ అంటూ గతంలో ఇచ్చిన జీరో బిల్లును వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నా, కొందరు మాత్రం ఎన్నికల కోడ్​లో భాగం అంటూ కొట్టిపడేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే గత నెలలో గృహజ్యోతి పథకం(Gruha Jyothi Scheme) కింద సరూర్​ నగర్​ సర్కిల్​లో పలువురు వినియోగదారులకు సున్నా బిల్లును విద్యుత్​ శాఖ జారీ చేసింది. ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ ఇక్కడ వర్తిస్తుందని తెలియడంతో అర్ధాంతరంగా సున్నా బిల్లుల జారీ ఆపేశారు. మిగతా అర్హత ఉన్న వినియోగదారులకు బిల్లులు జారీ చేశారు. సున్నా బిల్లు వచ్చిందని సంతోషపడిన వినియోగదారులకు విద్యుత్​ శాఖ ఇచ్చిన జలక్​తో ఒక్కసారిగా కరెంటు షాక్​ కొట్టినట్లు అయింది.

Gruha Jyothi Scheme Zero Bill in Telangana
Gruha Jyothi Scheme Zero Bill in Telangana

అమల్లోకి గృహజ్యోతి స్కీమ్ - అర్హులకు జీరో బిల్లులు అందజేస్తున్న మీటర్ రీడర్లు

Gruha Jyothi Scheme 2024 : గత నెల జారీ అయిన సున్నా బిల్లులన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. ఈ సున్నా బిల్లుల(Zero Current Bill) మొత్తాన్ని బకాయిలుగా చూపుతూ ఈ నెల వచ్చిన బిల్లులో కలిపి వినియోగదారుడికి అందిస్తున్నారు. ఈ క్రమంలో సరూర్​నగర్​ సర్కిల్​ అల్మాస్​గూడలో ఓ వినియోదారుడికి మార్చి 2వ తేదీన జారీ అయిన బిల్లులో గృహజ్యోతి రాయితీ రూ.262గా విద్యుత్​ సంస్థ చూపింది. వీరికి సున్నా బిల్లును వేశారు. ఇప్పుడు ఈ నెల వచ్చిన రూ.547 బిల్లుకు సున్నా బిల్లు బకాయి కలిపి రూ.809 చెల్లించాలని బిల్లుతో పాటు సమాచారం వచ్చింది.

Gruha Jyothi Scheme Problems : ఇప్పుడు ఈ బిల్లులు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తున్నాయి. సాంకేతిక సమస్య కారణంగా స్పాట్​ బిల్లింగ్​ యంత్రం మార్చిలో సున్నా బిల్లు జారీ అయిందని విద్యుత్​ సంస్థ తెలిపింది. ఈ పథకం ప్రారంభించినప్పుడు రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో ఎన్నికల కోడ్​(Election Code in Telangana) ఉందని గృహజ్యోతిని ప్రారంభించలేదు. అందుకే ఈ నెల ఎలక్ట్రానిక్​ బిల్లింగ్​ సిస్టమ్​(EBS) ప్రకారం సాధారణ బిల్లు జారీ అయిందని డిస్కం అధికారి వివరించారు.

బిల్లు వచ్చినవారు ఆ వివరాలతో మళ్లీ దరఖాస్తు చేయాలి - గృహజ్యోతిపై భట్టి క్లారిటీ

అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇక నో టెన్షన్‌ - గృహజ్యోతి వారికి కూడా వర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.