ETV Bharat / state

మండలికి నామినేట్​ చేయండి : గవర్నర్​కు దాసోజు శ్రవణ్​, కుర్రా సత్యనారాయణ విజ్ఞప్తి

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 7:49 PM IST

Dasoju Shravan Reacted To The HC Verdict : తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇద్దరి ఎమ్మెల్సీ నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ కొట్టివేసింది. వీరి నియామకంపై ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని ధర్మాసనం సూచించింది. ఈ నేపథ్యంలో దాసోజు శ్రవణ్​, కుర్రా సత్య నారాయణ తమను శాసన మండలికి నామినేట్​ చేయాలని గవర్నర్​ తమళిసైను కోరారు. హైకోర్టు తీర్పును వారు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. చట్టసభల్లో తమ వంతు పాత్ర పోషించి, తమ సామాజిక వర్గాలు, దేశానికి సేవ చేయాలన్న గొప్ప ఉత్సాహంతో ఉన్నామన్నారు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.

Dasoju Shravan Reacted To The HC Verdict
Dasoju Shravan

Dasoju Shravan Reacted To The HC Verdict : హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యాంగ బద్దంగా గత మంత్రివర్గం చేసిన సిఫార్సు ప్రకారం తమను శాసనమండలికి నామినేట్ చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ బీఆర్​ఎస్​ నేతలు దాసోజు శ్రవణ్ (Dasoju Shravan), కుర్రా సత్యనారాయణ కోరారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో చిత్తశుద్ధితో కూడిన తమ పోరాటం, త్యాగం, సేవలను గుర్తించాలని గవర్నర్​కు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలోని 171(5) ఆర్టికల్ ప్రకారం తమకు సరిపడా అర్హతలు ఉన్నాయన్న ఇరువురు నేతలు సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన తమ లాంటి వారికి శాసన వ్యవస్థలో ప్రాతినిథ్యం వహించే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయని అన్నారు. ప్రస్తుత సందర్భం మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.

Dasoju Shravan Complaint : 'రేవంత్​ రెడ్డి గ్యాంగ్..​ దండుపాళ్యం బ్యాచ్​ను తలపిస్తుంది'

హైకోర్టు తీర్పు, తమ అర్హతలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ బద్ధంగా 2023 జులైలో మంత్రివర్గం సిఫార్సును అమలు చేయాలని శ్రవణ్, సత్యనారాయణ కోరారు. రాజ్యాంగ స్ఫూర్తి, మానవతా న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. చట్టసభల్లో తమ వంతు పాత్ర పోషించి, తమ సామాజిక వర్గాలు, దేశానికి సేవ చేయాలన్న గొప్ప ఉత్సాహంతో ఉన్నామన్న దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ తెలిపారు.

'కేబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్ తిప్పి పంపొచ్చు, తిరస్కరించకూడదు' - హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు

Telangana HC Verdict On MLCs Appointments : గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి చుక్కెదురైంది. కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ల నియామకాలపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాలని న్యాయస్థానం సూచించింది. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం తెలిపింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ నేరుగా తిరస్కరించకుండా తిరిగి పంపించాల్సిందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా (Governor Quota MLCs) నియమించడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.

సెల్లార్​ నిర్మాణాలపై ముందస్తు అనుమతులు తీసుకోవాలి - స్పష్టం చేసిన హైకోర్టు

Telangana Cabinet Meeting To Day : శాసనమండలికి గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. కేబినేట్ నిర్ణయం

మళ్లీ తెరాస గూటికి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.