ETV Bharat / state

గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్- సైబర్ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 1:14 PM IST

Updated : Jan 17, 2024, 2:32 PM IST

Telangana Governor Twitter Account Hacked : రోజురోజుకూ సైబర్​ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విటర్(ఎక్స్‌) అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. సైబర్ కేటుగాళ్లు గవర్నర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసినట్లు రాజ్​భవన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Governor Tamilisai Twitter Account Hacked
Governor Tamilisai

Telangana Governor Twitter Account Hacked : ఎంతో కాలంగా ఎందరో సెలబ్రిటీలు, రాజకీయ నేతలు హ్యాకింగ్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా హ్యాకింగ్ బాధితురాలయ్యారు. ఆమె ఎక్స్ (ట్విటర్) అకౌంట్ హ్యాక్​కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి పాస్ వర్డ్ మార్చినట్లు సమాచారం. కంపెనీ నియమనిబంధనలు ఉల్లంఘించారంటూ ఎక్స్​ కంపెనీ నుంచి గవర్నర్​కు ఓ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.

Telangana Governor X Account Hack : గవర్నర్ తన అకౌంట్​ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా, పాస్ వర్డ్ తప్పంటూ జవాబు వచ్చినట్లు రాజ్​భవన్ అధికారులు తెలిపారు. అందులో పోస్టులను పరిశీలించిన తమిళిసై, తనకు సంబంధంలేని పోస్టులు పెట్టినట్లు గుర్తించారని వెల్లడించారు. ఈ విషయంపై రాజ్​భవన్ సిబ్బందిని ఆరా తీసినట్లు చెప్పారు. చివరకు తన అకౌంట్ హ్యాకింగ్​కు గురైనట్లు గమనించిన గవర్నర్ తమిళిసై దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గవర్నర్ ఆదేశాలతో రాజ్​భవన్​ అధికారులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. గవర్నర్ ఎక్స్​ అకౌంట్​ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాఫ్తు చేపట్టినట్లు తెలిసింది.

Revanth Reddy React on Iphone Hack Alerts : " మా ఫోన్లను హ్యాక్ చేయడం.. గోప్యత, రాజకీయ హక్కుల ఉల్లంఘనే"

Minister Damodara Rajanarsimha Facebook Account Hacked : ఇటీవలే రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్​బుక్ ఖాతా కూడా హ్యాక్​కు గురైన విషయం విధితమే. మంత్రి ఖాతాను తమ కంట్రోల్​లోకి తీసుకున్న సైబర్ కేటుగాళ్లు, అందులో బీజేపీ, టీడీపీ, తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీల ఫొటోలను వందల సంఖ్యలో పోస్టు చేశారు. అనుచరులు అలర్ట్ చేయడంతో స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్​కు గురైందని, అందులో పెట్టిన పోస్తులకు ఎవరూ స్పందించవద్దని కార్యకర్తలు, నేతలకు సూచించారు. ఈ మేరకు హ్యాకింగ్​ ఘటనపై సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్​ అకౌంట్లు కూడా హ్యాకింగ్​కు గురయ్యాయి.

How To Protect WiFi Router From Hackers : మీ WiFi హ్యాక్​ అయిందని డౌట్​గా ఉందా?.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నో ప్రాబ్లమ్​!

Celebrities Accounts Hack : ఇటీవల ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్​కు గురవ్వడం సాధారణమైపోయింది. కేవలం వారి ఖాతాలే కాదు. కొన్నిసార్లు బ్యాంకు సర్వర్లు కూడా హ్యాకింగ్​కు గురవుతున్నాయి. గతంలో మహేశ్ బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు ఏకంగా రూ.12 కోట్లను కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హ్యాకింగ్​కు గురి కాకుండా ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాల పాస్​వర్డ్​లను పటిష్ఠంగా సెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్​బుక్​ అకౌంట్​ హ్యాక్

Data Leak ICMR : దేశ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్.. 81 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు హ్యాక్​

Last Updated : Jan 17, 2024, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.