ETV Bharat / state

రూ.500కే గ్యాస్​ సిలిండర్ - మూడేళ్ల సగటు లెక్క ప్రకారమే కసరత్తు!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 11:59 AM IST

Congress Government on Gas Cylinder Scheme : రూ.500కే గ్యాస్​ సిలిండర్​ వారం రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి​ ప్రకటించారు. దీంతో పౌరసరఫరాలశాఖ ఈ పథకం అమలుకు కసరత్తును ప్రారంభించింది. ఇందుకోసం రేషన్​కార్డు దారులు గత మూడు సంవత్సరాల్లో సగటున ఎన్ని సిలిండర్లు వాడారో అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు.

Gas Cyliner For RS.500 Is Implemented in Next 1 Week
Government Focus on RS.500 Gas Cylinder Scheme

Congress Government on Gas Cylinder Scheme : అర్హులైనవారి గృహావసరాలకు రూ.500కే గ్యాస్​ సిలిండర్ పథకం అమలుకు కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. రేషన్​ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్లు గ్యాస్​ కనెక్షన్లు ఉన్నాయి. అందులో రేషన్​​కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99లక్షలు. రేషన్​కార్డు ఉన్న కుటుంబాలు గత మూడేళ్లలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణలోని తీసుకోవాలని సర్కార్ నిర్ణయించినట్ల విశ్వసనీయ సమాచారం. మరో వారం రోజుల్ల రూ.500కు గ్యాస్​ సిలిండర్​, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Mahalakshmi Gas Cylinder Scheme in Telangana : మొత్తం 1.20 కోట్ల కనెక్షన్లతో 44 శాతం మంది ప్రతి నెలా ఒక గ్యాస్​ సిలిండర్ వాడుతున్నట్లు పౌరసరఫరాలశాఖ గుర్తించింది. రేషన్​​కార్డు ఉన్న వారికే ఇది వర్తింపచేస్తే ఈ శాతం మరింత తగ్గుతుంది. గత మూడేళ్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని కొద్దిరోజుల క్రితం జరిగిన కేబినేట్​ సమావేశంలో ప్రభుత్వం చర్చించినట్లు తెలుస్తోంది. ఇందుకు గరిష్ఠ పరిమితి ఏదీ లేదని సమాచారం.

త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

500 Rupees Gas Cylinder Scheme in Telangana : ఉదాహరణకు ఒక కుటుంబం గత మూడేళ్లలో ఏడాదికి సగటున 8 సిలిండర్లు వాడితే ఆ కుటుంబానికి రూ.500 గ్యాస్ సిలిండర్​లు ఏడాదికి ఎనిమిదే ఇచ్చే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి సగటున ఐదు చొప్పున వాడితే ఐదే ఇస్తారు. పథకం అమలయ్యాక మూడేళ్ల సగటు కంటే ఎక్కువ సిలిండర్లు వాడినా అదనంగా తీసుకున్న సిలిండర్లకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ వర్తించదు. వాటికి పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. ప్రస్తుతం సిలిండర్​ ధర రూ.955 కాగా కేంద్రం రూ.40 సబ్సిడీగా ఇస్తోంది. ఈ రాయితీ సొమ్ము సిలిండర్​ తీసుకున్న తర్వాత బ్యాంకు ఖాతాల్లో పడుతోంది.

కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్​న్యూస్​​- ​సిలిండర్​పై రూ.39.50 తగ్గింపు

పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారి ఒకరు రెండు రోజల క్రితం దిల్లీకి వెళ్లారు. హెచ్‌పీసీఎల్‌, ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌ సంస్థలు గ్యాస్‌ సిలిండర్లను అందిస్తున్నాయి. సిలిండర్​ ధర రూ.955 కాగా, రూ.500కు ఇస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వినియోగదారుడు ముందు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నగదు బదిలీ ద్వారా వినియోగదారుల ఖాతాలో వేయాలా? లేదంటే చమురు సంస్థలకే చెల్లించి అర్హులైనవారు రూ.500కే సిలిండర్​ పొందేలా చూడాలా? అన్న విషయాన్ని పౌరసరఫరాలశాఖ పరిశీలిస్తోంది. దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారి చమురు సంస్థలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ పథకానికి ఆధార్​ను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి సిలిండర్​ కనెక్షన్​ పాస్​బుక్​, రేషన్​ కార్డు, ఆధార్​ కార్డును పరిశీలించి అర్హుల వివరాలను ప్రత్యేక సాఫ్ట్​వేర్​లో నమోదు చేస్తున్నారు.

బడ్జెట్​కు ముందు షాక్- గ్యాస్ సిలిండర్ ధర పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.