ETV Bharat / business

కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్​న్యూస్​​- ​సిలిండర్​పై రూ.39.50 తగ్గింపు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 12:51 PM IST

Updated : Dec 22, 2023, 1:31 PM IST

Commercial LPG rate Cut
Commercial LPG Prices Cut

Commercial LPG Prices Cut In Telugu : ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMC) కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్​ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల సిలిండర్​ ధరను రూ.39.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వంట గ్యాస్ ధరలు మాత్రం యథాతథంగా ఉంచాయి.

Commercial LPG Prices Cut : కేంద్ర ప్రభుత్వం కమర్షియల్​ ఎల్​పీసీ గ్యాస్ వినియోగదారులకు గుడ్​ న్యూస్ చెప్పింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్​ సిలిండర్​ ధరను రూ.39.50 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ ధరలు మాత్రం యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.903గా ఉంది.

నగరాలు - గ్యాస్ సిలిండర్​ ధరలు
Commercial LPG Gas Price Today : కమర్షియల్ ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్లను హోటల్స్​, రెస్టారెంట్లు లాంటి వాటిల్లో వాడతారు. తాజా తగ్గిన కమర్షియల్ ఎల్​పీజీ సిలిండర్​ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. దీనితో దిల్లీలో రిటైల్​ 19కేజీ కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ.1,796.50 నుంచి రూ.1757లకు తగ్గింది.

రిటైల్​ 19కేజీ కమర్షియల్​ ఎల్​పీజీ సిలిండర్​ ధరలు కోల్​కతాలో రూ.1,868.50కు, చెన్నైలో రూ.1929, ముంబయిలో రూ.1,710కు చేరుకున్నాయి.

ఓవర్ సప్లై
భారత్​ - సౌదీ అరేబియా మధ్య ఉన్న ఎల్​పీజీ కాంట్రాక్ట్​ ప్రైస్​ బాగా తగ్గింది. సౌదీ నుంచి భారత్​కు ఎల్​పీజీ ఓవర్​ సప్లై కావడమే ఇందుకు కారణం.

ప్రతినెలా ఒకటో తారీఖున
ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​ (BPCL), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​ (HPCL)లు ప్రతి నెల 1వ తేదీన వంటగ్యాస్​, ఏటీఎఫ్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అందులో భాగంగా తాజాగా కమర్షియల్ వంట గ్యాస్ ధరలను స్వల్పంగా తగ్గించాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం : ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రికార్డు స్థాయిలో గత 21 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగానే ఉంచుతున్నాయి. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్​ డీజిల్ ధర రూ.89.62లుగా ఉంది.

ఎల్​పీజీ సిలిండర్​ ధరలను ఎలా, ఎక్కడ చెక్​ చేయవచ్చు?
How To Check LPG Gas Rate Online : ఎల్​పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే, ఇండియన్ ఆయిల్​ అధికారిక వెబ్​సైట్​​ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఇదే వెబ్​సైట్​లో ఎల్​పీజీ ధరలతోపాటు, జెట్​ ఫ్యూయెల్​, ఆటో గ్యాస్​, కిరోసిన్​ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.

రూ.15 లక్షల బడ్జెట్​లో మంచి కారు కొనాలా? టాప్​-10 మోడల్స్ ఇవే!

అర్జెంట్​గా లోన్ కావాలా? మీ LIC పాలసీపై తక్కువ వడ్డీకే రుణం పొందండిలా!

Last Updated :Dec 22, 2023, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.