ETV Bharat / state

గుంటూరులో విజృంభిస్తున్న డయేరియా - మరొకరు మృతి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 3:55 PM IST

Updated : Feb 16, 2024, 7:15 PM IST

guntur_diarrhea
guntur_diarrhea

Another Person Died Due to Diarrhea in Guntur: గుంటూరు నగరపాలక సంస్థ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నగరంలోని సరఫరా అయ్యే నీరు కలుషితం కావడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. డయేరియాతో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు ఇటీవల యువతి మృతి చెందగా తాజాగా మరో వ్యక్తి మృతి చెందాడు.

Another Person Died Due to Diarrhea in Guntur: గత కొన్ని రోజులుగా గుంటూరులో డయేరియా కేసులు (Diarrhea cases in Guntur) పెరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పైపు లైన్లు పాడైపోయిన చోట కొత్తవాటిని అమర్చడం, లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా ఉండటం వల్లే తాగునీరు కలుషితమవుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల గుంటూరులో డయేరియాతో యువతి మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. గుంటూరులో ఇటీవలే కలుషిత నీరు తాగి దాదాపు 80 మంది జీజీహెచ్​లో చేరారు. వారిలో షేక్​ ఇక్బాల్ 4 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయం మృతి చెందిన ఇక్బాల్ కుటుంబ సభ్యులను టీడీపీ ఇన్​ఛార్జీ నజీర్ పరామర్శించారు. షేక్ ఇక్బాల్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

గుంటూరులో విజృంభిస్తున్న డయేరియా - మరొకరు మృతి

డయేరియాపై మంత్రి విడదల రజిని వ్యాఖ్యలు విడ్డూరం: టీడీపీ నేతలు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు: నగరంలో కలుషిత నీటి సమస్య (Contaminated water problem in Guntur) ఉన్నా అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపు లైన్లు పాడైపోయిన చోట మరమ్మతులు చేయకుండా ఉండటం వల్లే తాగునీరు కలుషితమవుతోందని నగర వాసులు అంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. తాగునీరు కలుషితం అవుతుందని ఫిర్యాదు చేసినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే మరణాలు సంభవించేవి కాదన్నారు. శ్రీనగర్, సంపత్ నగర్, నెహ్రూనగర్, సంగడిగుంట, శారదా కాలనీ ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య ఎక్కువగా కనిపిస్తోందన్నారు.

గుంటూరులో డయేరియా బాధితలకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతల ఆందోళన!

TDP - Jana Sena Leaders Protest: కలుషిత తాగి మృతి చెందిన బాధిత కుటుంబానికి, అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గుంటూరు టీడీపీ - జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ప్రజలు కలుషిత నీరుతో డయేరియాకు గురికావడం ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. వందలాది మంది ఆస్పత్రి పాలవుతుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. ఆసుపత్రికి వెళ్లిన నేతలు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

గుంటూరులో డయేరియా కలకలం - కలుషిత నీరు తాగి యువతి మృతి, 10 మందికి అస్వస్థత

Woman Died Due to Diarrhea: కొద్దిరోజుల క్రితం శారదాకాలనీకి చెందిన పద్మ (18) అనే యువతి కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలైంది. పద్మను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. ఇంకా అనేక ప్రాంతాలకు చెందిన మరి కొందరు బాధితులు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు.

Health Minister Vidadala Rajani: వాంతులు, విరేచనాలతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వారి సంఖ్య 75కు చేరిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. సుమారు 170 మంది వరకు డయేరియా లక్షణాలతో బాధితులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా వైద్యులు వివరించగా మంత్రి రజిని వాటిని వక్రీకరంచే ప్రయత్నం చేసి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని స్థానికులు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శారదా కాలనీలో యువతి డయేరియాతో చనిపోకపోతే రూ.5 లక్షల పరిహారం ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.

Last Updated :Feb 16, 2024, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.