ETV Bharat / sports

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్ - రోహిత్‌ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 10:42 PM IST

Rohit Sharma T20 World Cup : బీసీసీ సెక్రటరీ జై షా ఇటీవలే ఓ ఈవెంట్​లో కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న టీ20 ప్రపంచకప్​కు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Rohit Sharma T20 World Cup
Rohit Sharma T20 World Cup

Rohit Sharma T20 World Cup : బీసీసీఐ సెక్రటరీ జై షా ఇటీవలే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్‌ నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో రోహిత్‌ శర్మ సారథ్యంలోనే భారత జట్టు బరిలో దిగనుందని ఆయన వెల్లడించారు. రోహిత్ సారథ్యంలోనే ప్రపంచ కప్‌ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన ఓ ఈవెంట్ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక 2023 వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించిన టీమ్‌ఇండియా ప్లేయర్లు అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో ఓడినప్పటికీ క్రికెట్ లవర్స్​ మనసులు గెలుచుకుందన్నారు. 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జెండా రెపరెపలాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా భారత జట్టును నడిపించిన రోహిత్‌ శర్మ ఆ తర్వాత ఈ ఫార్మాట్లో బరిలోకే దిగలేదు. కోహ్లి సైతం టీ20లకు దూరంగానే ఉన్నాడు. అప్పట్నుంచి హార్దిక్‌ పాండ్య సారథ్యంలోనే జట్టు ఆడుతోంది. అతను అందుబాటులో లేనపుడు తాత్కాలిక కెప్టెన్ల నాయకత్వంలో ఆడుతోంది. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో రోహిత్‌, కోహ్లి టీ20 జట్టులోకి పునరాగమనం చేస్తారా అన్న చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు జై షా మాటలతో హిట్​మ్యాన్ ఫ్యాన్స్​ ఊపిరి పీల్చుకున్నారు.

T20 World Cup 2024 : జూన్‌లో యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ ఇరు దేశాలు సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీని నిర్వహిస్తున్నాయి. దాదాపు 20 జట్లు ఈ పొట్టి కప్​లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఇంకా అధికారికంగా షెడ్యూల్‌ ఖరారు కాలేదు. కానీ, క్రికెట్‌ వర్గాల ప్రకారం భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య ఈ ఏడాది జూన్ 9న మ్యాచ్‌ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రూప్‌ స్టేజ్‌లో మాత్రం టీమ్ఇండియా మ్యాచ్‌లు జూన్‌ 5 ప్రారంభమవుతాయి. మిగతా నాలుగు జట్లతో యూఎస్‌ఏ వేదికగానే భారత్ మ్యాచ్‌లు జరగనుంది.

ఈ క్రికెట్లర కెరీర్​లో ఆ ఒక్కటే లోటు!

రోహిత్​ 2.0 - ఇలానే విజృంభిస్తే T20 వరల్డ్​కప్​ మనదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.