ETV Bharat / sports

మళ్లీ ముంబయిదే పైచేయి - 5 వికెట్ల తేడాతో గుజరాత్​పై గెలుపు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 10:52 PM IST

Updated : Feb 25, 2024, 11:02 PM IST

Mumbai Indians Vs Gujarat Titans
Mumbai Indians Vs Gujarat Titans

MI VS GT WPL 2024 : మహిళల ప్రీమియర్‌ లీగ్​లో భాగంగా ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు చేలరేగిపోయింది. ప్రత్యర్థులు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో చేధించి గెలుపొందింది.

MI VS GT WPL 2024 : మహిళల ప్రీమియర్‌ లీగ్​లో భాగంగా ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు చేలరేగిపోయింది. ప్రత్యర్థులు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో చేధించి గెలుపొందింది. తొలి మ్యాచ్​లో గెలిచిన ముంబయి ఇప్పుడు ఈ రెండో విజయంతో రెట్టింప ఉత్సాహాన్ని అందుకుంది.

మ్యాచ్ సాగిందిలా :

తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ 126/9 స్కోర్‌ చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి జట్టు 5 వికెట్లను చేజార్చుకుని 18 ఓవర్లలో 129 పరుగుల స్కోర్​ సాధించింది. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 46 పరుగులతో అజేయ విక్టరీని సాధించింది. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి పోరాడింది. తన కీలక ఇన్నింగ్స్​తో జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఇక హర్మన్​తో పాటు అమెలియా కెర్ (31), నాటస్కివెర్ బ్రంట్ (22) కూడా తమ ఇన్నింగ్స్​లో రాణించారు.

మరోవైపు భారీ ఆశలతో వచ్చిన యస్తికా భాటియా (7), హీలే మాథ్యూస్ (7), పూజా వస్త్రాకర్ (1) విఫలమయ్యారు. గుజరాత్‌ బౌలర్లు తనుజా కాన్వార్ 2, లీ తహుహు, కాథరిన్‌ బ్రైస్ చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ముంబయి (4) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది.

ఇక గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు చెందిన కేథరీన్‌ బ్రైస్‌ (25*) కెప్టెన్‌ బెత్‌ ఫర్వాలేదనిపించగా, ఆష్లే గార్డ్‌నర్‌ (15), వేద కృష్ణమూర్తి (0), హర్లీన్‌ డియోల్‌ (8), లిచ్‌ఫీల్డ్‌ (7), దయాలన్‌ హేమలత (3), స్నేహ్‌ రాణా (0), లియా తహుహు (0) విఫలమయ్యారు.

ముంబయి ఇండియన్స్‌ : హేలీ మాథ్యూస్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌, యస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), ఇస్మాయిల్‌, నటాలీ సీవర్‌ బ్రంట్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), అమెలియా కెర్‌, పూజా వస్త్రకార్‌, ఎస్‌. సంజన, షబ్నిమ్‌ సైకా ఇషాక్‌

గుజరాత్‌ జెయింట్స్ : బెత్‌ మూనీ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), వేదా కృష్ణమూర్తి, కత్రిన్‌ బ్రైస్‌, హర్లీన్‌ డియోల్‌, ఫొబె లిచ్‌ఫీల్డ్‌, ఆష్లే గార్డ్‌నర్‌, హేమలత, స్నేహ్‌ రాణా, తనూజా కన్వర్‌, లీ తహుహు, మేఘనా సింగ్‌

డబ్ల్యూపీఎల్​ 2024 : ఒకే ఒక్క సిక్సర్​తో దూసుకొచ్చిన ఆటోవాలా కూతురు!

ఆఖరి బంతికి సిక్స్‌ - తొలి మ్యాచ్​లో ముంబయిదే బోణి

Last Updated :Feb 25, 2024, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.