ETV Bharat / sports

ఆఖరి బంతికి సిక్స్‌ - తొలి మ్యాచ్​లో ముంబయిదే బోణి

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 6:20 AM IST

Updated : Feb 24, 2024, 8:55 AM IST

MI vs DC WPL 2024: 2024 మహిళల ప్రీమియర్ లీగ్​లో ముంబయి ఇండియన్స్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్​లో దిల్లీతో తలపడ్డ ముంబయి 4 వికెట్ల తేడాతో నెగ్గింది.

MI vs DC WPL 2024
MI vs DC WPL 2024

MI vs DC WPL 2024: 2024 డబ్ల్యూపీఎల్​లో ముంబయి ఇండియన్స్ శుభారంభం చేసింది. శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో ముంబయి 4 వికెట్ల తేడాతో నెగ్గింది. దిల్లీ నిర్దేశించిన 171 పరుగుల టార్గెట్​ను ముంబయి ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యస్తికా భాటియా (57) అదరగొట్టింది. దిల్లీ బౌలర్లలో అరుంధతి రెడ్డి 2, మరిజన్నె కాప్‌ 1 వికెట్ దక్కించుకున్నారు.

భారీ లక్ష్య ఛేదనలో ముంబయికి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్​ రెండో బంతికే ఓపెనర్ హేలీ మాథ్యూస్ (0) డకౌట్​గా పెలివియన్ చేరింది. వన్ డౌన్​లో వచ్చిన నాట్ సీవర్ (19) వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకుంది. మరో ఓపెనర్ యస్తికా భాటియా, కెప్టెన్ హర్మన్​ప్రీత్​తో కలిసి భాగస్వామ్యం నిర్మించింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ (1) నిరాశ పర్చింది. ఆమెను షబ్మిమ్ ఇస్మైల్ క్లీన్ బౌల్డ్​ చేసింది. అలీస్ కాప్సీ (75) సూపర్ హాఫ్ సెంచరీకి తోడు జెమిమా రోడ్రిగ్స్ (42 పరుగులు, 24 బంతుల్లో; 5x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్​తోడైంది. మరో ఓపెనర్ లానింగ్ (31 పరుగులు) రాణించింది. దీంతో దిల్లీ భారీ స్కోర్ చేయగలిగింది. చివర్లో మరిజామ్నే కాప్ 16 పరుగులు (3 ఫోర్లు) రాణించింది. ఇక ముంబయి బౌలర్లలో నాట్ సీవర్ 2, అమెలియా కేర్ 2, షబ్మిమ్ ఇస్మైల్ 1 వికెట్ దక్కించుకున్నారు.

  • తుది జట్లు
    ముంబయి ఇండియన్స్‌: హీలే మాథ్యూస్‌, నాట్ స్కివెర్‌ బ్రంట్, హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), అమేలియా కెర్, అమన్‌జోత్ కౌర్, సజనా, పూజా వస్త్రాకర్, షబ్నిమ్‌ ఇస్మాయిల్, కీర్తన బాలకృష్ణన్, సైకా ఇషాక్‌
  • దిల్లీ క్యాపిటల్స్‌: షఫాలీ వర్మ, మెగ్ లానింగ్‌ (కెప్టెన్), ఎలిస్‌ కాప్సే, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్నె కాప్‌, అనాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, మిన్ను మని, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్‌, షికా పాండే

గ్రాండ్​గా ప్రారంభమైన WPL- స్పెషల్ అట్రాక్షన్​గా బాలీవుడ్ స్టార్ల పెర్ఫార్మెన్స్​

WPLలో తెలుగమ్మాయిలు- వీరిలో సత్తా చాటేదెవరో?

Last Updated :Feb 24, 2024, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.