ETV Bharat / sports

గ్రాండ్​గా WPL ప్రారంభం- స్పెషల్ అట్రాక్షన్​గా బాలీవుడ్ స్టార్స్​ పెర్ఫార్మెన్స్​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 7:55 PM IST

Updated : Feb 23, 2024, 9:18 PM IST

Wpl Opening Ceremony 2024
Wpl Opening Ceremony 2024

WPL Opening Ceremony 2024:2024 డబ్ల్యూపీఎల్ ఘనంగా మొదలైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బాలీవుడ్ స్టార్లు పెర్ఫార్మెన్స్​లతో ఆకట్టుకున్నారు.

WPL Opening Ceremony 2024: 2024 మహిళల ప్రీమియర్‌ లీగ్‌ శుక్రవారం (ఫిబ్రవరి 23) అట్టహాసంగా ప్రారంభమైంది. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, టైగర్ జాకీష్రాఫ్, షాహిద్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా, ఆర్యన్ కార్తిక్ పాల్గొని సందడి చేశారు. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్​తో అదరగొట్టరు. హీరోల డ్యాన్స్​లతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం హోరెత్తింది. ఇక ముంబయి ఇండియన్స్- దిల్లీ క్యాపిటల్స్​ మ్యాచ్​తో రెండో సీజన్ టోర్నీకి తెర లేవనుంది.

ఓపెనింగ్ సెర్మనీలో స్టార్ హీరోలు తమ పెర్ఫార్మెన్స్​తో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ డబ్ల్యూపీఎల్ టోర్నీని రిప్రజెంట్ చేస్తూ పెర్ఫార్మెన్స్ ఇవ్వగా, మిగిలిన హీరోలు ఒక్కొక్కరు ఒక్కో టీమ్​కు సపోర్టింగ్​గా నిలిచారు. ఆర్యన్ కార్తిక్ (గుజరాత్ టైటాన్స్), షాహిద్ కపూర్ (ముంబయి ఇండియన్స్), సిద్దార్థ్ మల్హోత్రా (దిల్లీ క్యాపిటల్స్), టైగర్ జాకీష్రాఫ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), వరుణ్ ధావన్ (యూపీ వారియర్స్) జట్ల తరఫున నిలిచారు. వీరితోపాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఐపీఎల్‌ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు.

ఇక ఈ ఎడిషన్​లో ఆఫ్స్​ సహా మొత్తం 22 మ్యాచ్​లు జరగనున్నాయి. ఈ​ మ్యాచ్​లకు బెంగళూరు, దిల్లీ నగరాలు ఆతిథ్యమిస్తున్నాయి. మొదట 11 మ్యాచ్​లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతాయి. ఆ తర్వాత మిగిలిన 9 లీగ్ మ్యాచ్​లతోపాటు రెండు ఫ్లే ఆఫ్స్ మ్యాచ్​లకు దిల్లీ అరుణ్ జైట్లి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

కాగా, రెండోసారి కూడా టైటిల్ నెగ్గాలన్న కసితో ముంబయి బరిలోకి దిగగా, తొలి ఎడిషన్​లో మిస్సైన కప్​ను ఈసారైన ఒడిసిపట్టాలని దిల్లీ భావిస్తోంది. మిగిలిన జట్లు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా టైటిల్​పై కన్నేశాయి. అన్ని మ్యాచ్ కూడా సాయంత్రం 7.30గంటలకు ప్రారంభం అవుతాయి. డబ్ల్యూపీఎల్ అన్ని మ్యాచ్​లను బ్రాడ్​కాస్టింగ్ ఛానెల్ స్పోర్ట్స్​ 18లో, అలాగే జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్​లో చూడవచ్చు.

గెట్​రెడీ క్రికెట్​ ఫ్యాన్స్- WPL ఓపెనింగ్ సెర్మనీకి స్టార్ హీరో- ఈసారి మరింత గ్రాండ్​గా

WPL 2024కు రంగం సిద్ధం - అమ్మాయిలు రెడీగా ఉన్నారా?

Last Updated :Feb 23, 2024, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.