ETV Bharat / spiritual

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే! - vastu tips for home

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 2:21 PM IST

Vastu Tips To Attract Money : కొంత మంది ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో బాధపడతుంటారు. ఎంత సంపాదించినా కూడా నెలాఖరుకు ఎవరో ఒకరి దగ్గర అప్పులు చేస్తూనే ఉంటారు! మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా? అయితే, లక్ష్మీకటాక్షం పొందడానికి మీ ఇంట్లో ఈ వస్తువులు పెట్టుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

Vastu Tips To Attract Money
Vastu Tips To Attract Money

Vastu Tips To Attract Money : బాగా డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అందు కోసమే ఉదయం నుంచి రాత్రి వరకూ అందరూ ఎంతో కష్టపడుతుంటారు. అయితే, కొంత మందికి ఎంత డబ్బు సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. దీంతో బంధువులు, స్నేహితులు, వడ్డీవ్యాపారుల వద్ద తరచూ అప్పులు చేస్తుంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు వాస్తు ప్రకారం.. ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల సిరిసంపదలకు లోటు ఉండదని వాస్తు పండితులంటున్నారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పిరమిడ్‌ :
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పిరమిడ్ పెట్టుకోవడం చాలా మంచిది. ఇంట్లో పిరమిడ్ ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల ఆదాయం పెరుగుతుంది. అలాగే ఇంట్లో పిరమిడ్‌ ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే, వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో వెండి, ఇత్తడి, లేదా రాగితో చేసిన పిరమిడ్‌లను పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇవి కొంత ఎక్కువ ఖరీదు ఉంటాయి.

ఒకవేళ మీరు వీటిని కొనలేకపోతే చెక్కతో చేసిన పిరమిడ్‌లను పెట్టుకోవచ్చు. కానీ, ఎట్టిపరిస్థితుల్లో కూడా ఇనుము, అల్యూమినియం, ప్లాస్టిక్‌ వంటి వాటితో చేసిన పిరమిడ్‌లను పెట్టవద్దు. అలాగే పిరమిడ్‌ ఫొటోలను కూడా పెట్టుకోవద్దని పండితులు తెలియజేస్తున్నారు. పిరమిడ్‌ను ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య మూలలో పెట్టాలి. అలాగే ఉత్తర దక్షిణ దిశలో కూడా పిరమిడ్‌ను పెట్టుకోవచ్చు.

కోరిన కోర్కెలు తీర్చే 'బెల్లం గణపతి'! స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠించిన గణేశుడు ఎక్కడున్నాడో తెలుసా? - Visakhapatnam Bellam Vinayakudu

పంచముఖ ఆంజనేయ స్వామి :
వాస్తు ప్రకారం ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫొటో ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ ఫొటో ఉండటం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ సిరిసంపదలకు లోటు ఉండదని అంటున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

లక్ష్మీదేవి :
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలూ జరగకుండా, ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండటానికి పద్మంపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజగదిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో డబ్బులకు ఎలాంటి లోటూ ఉండదని పండితులు చెబుతున్నారు.

కొంత మంది మహిళలు రాత్రి సమయంలో వంటింట్లో ఖాళీ బిందెలను ఉంచుతారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా అస్సలు చేయకూడదట. బిందెలలో నీళ్లు ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని అంటున్నారు.

వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను ఈ దిక్కులో పెడితే లక్ష్మీ కటాక్షం! అదృష్టం మీ వెంటే! - Tulasi plant Vastu direction

అరుణాచల గిరిప్రదక్షిణకు - ఈ రోజుల్లో వెళ్తే కుటుంబానికి అంతా శుభమే! - ARUNACHALAM GIRI PRADAKSHINA DATES

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.