ETV Bharat / spiritual

వాస్తు - పూజ గదిలో ఈ వస్తువులు అస్సలు పెట్టకండి! - లేకపోతే కష్టాలు తప్పవు! - vastu tips for home

vastu tips for home : వాస్తు నియమాల ప్రకారం, పూజ గదిలో కొన్ని వస్తువులు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి.. ఆ వస్తువులు ఏంటో మీకు తెలుసా?

Vastu Tips For Home
Vastu Tips For Home
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 1:33 PM IST

Updated : Apr 6, 2024, 2:22 PM IST

vastu tips for home : భగవంతుడని ఆరాధించడానికి ప్రతీ ఇంట్లో చిన్నదో పెద్దదో.. ఒక పూజగది ఉంటుంది. అయితే.. ఆ పూజగదిలో కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పూజ గది ఏ దిక్కులో ఉండాలి?
వాస్తు ప్రకారం.. కొత్తగా ఇంటిని నిర్మించే వారు పూజ గదిని ఈశాన్య దిక్కులో ఉండేలా చూసుకోవాలి. పొరపాటున కూడా పూజ గదిని దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయకూడదట. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రగిలే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులంటున్నారు.

పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైనే!

  • వాస్తు నిపుణుల ప్రకారం.. పూజ గదిలో విరిగిన విగ్రహాలు లేదా విరిగిన పదార్థాలు ఉండకూడదు. వీటివల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం కలుగుతుందని చెబుతున్నారు.
  • ఇంట్లో లేదా పూజ గదిలో రుద్ర ముద్రలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను ఉంచకూడదట. దీనివల్ల ఇంట్లో నెగటివ్‌ ఎనర్జీ ప్రభావం ఉంటుందని తెలియజేస్తున్నారు.
  • మీ పూజ గదిలో ఎప్పుడూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను ఉంచకూడదు.
  • వీటికి బదులుగా పూజ గదిలో వెండి, ఇత్తడి, బంగారం లేదా మట్టితో తయారు చేసిన ప్రతిమలు ఉండేలా చూసుకోండి.
  • ఇష్టమైన దేవుళ్ల ఫొటో ఫ్రేమ్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
  • వాస్తు ప్రకారం ఇంట్లో ఒకే ఒక్క వినాయకుడి విగ్రహం ఉండాలి.
  • అలాగే వాస్తు నియమాల ప్రకారం ఎప్పుడూ కూడా పుజ గదిలో నిలబడి లేదా నృత్యం చేస్తున్న గణేశ్ విగ్రహాన్ని ఉంచకూడదు.
  • చాలా మంది ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే, ఇంట్లో శివలింగాన్ని ఉంచకపోవడమే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
  • అలాగే శివుడి ఉగ్ర రూపాన్ని చూపించే ఏ విగ్రహాన్ని కూడా పూజ గదిలో పెట్టకూడదట.
  • పూజ గదిలో శివుడి ప్రతిమను పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
  • అలాగే దుర్గమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
  • మహిషాసుర మర్దని స్వరూపం, యుద్ధం చేసే చండికా దేవి రూపం వంటి విగ్రహాలు లేదా చిత్రాలను పూజ గదిలో పెట్టుకోవడం మంచిది కాదట.
  • దుర్గామాత విగ్రహాంలో సింహం నోరు మూసుకొని ఉండాలని తెలియజేస్తున్నారు.
  • వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడూ కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచండి.
  • శని, రాహువు, కేతువు లేదా మరే ఇతర గ్రహ దేవతల చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. వీటివల్ల ఇంట్లో అశాంతులు, కలహాలు వచ్చే అవకాశం ఉందట.
  • ఇంకా పూజ గదిలో బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఉండకూడదని సూచిస్తున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మీ పూజగదిలో ఈ మార్పులు చేయండి - ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది!

ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా? - వాస్తు ఏం చెబుతోందో తెలుసా? - VASTU TIPS FOR LEMON PLANT

Last Updated : Apr 6, 2024, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.