ETV Bharat / spiritual

ఆఫీస్​లో ఈ వాస్తు నియమాలు పాటిస్తే - మీ విజయాలను ఎవరూ అడ్డుకోలేరు! - Vastu Tips For Office

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 9:55 AM IST

Vastu Tips For Office : ఇంటి నిర్మాణం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాస్తు ప్రకారం కట్టుకుంటారు. అవసరమైతే మార్పులు చేసుకుంటారు. మరి.. మీ ఆఫీస్​లో పరిస్థితి ఏంటి? అక్కడ మీరు ఎలాంటి మార్పులూ చేయలేరు. అయితే.. కొన్ని వాస్తు నియమాలను పాటించవచ్చు అంటున్నారు నిపుణులు!

Vastu Tips For Office
Vastu Tips For Office

Vastu Tips For Office : మన దేశంలో చాలా మంది వాస్తు నియమాలను పక్కాగా పాటిస్తారు. ముఖ్యంగా కొత్త ఇంటిని నిర్మించుకునేటప్పుడు, అలాగే ఏదైనా స్థలాన్ని తీసుకునేటప్పుడు వాస్తు నియమాలను చూస్తారు. ఇంకా ఇంటిలో ఏ దిశలో గదుల నిర్మాణం జరగాలనేది కూడా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. అయితే.. ఉద్యోగం చేసేవారు తమ పని ప్రదేశంలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వీటిని పాటించడం వల్ల అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. మరి ఆఫీస్‌లో ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలో మీకు తెలుసా?

ఈ వాస్తు టిప్స్ పాటించండి!

  • వాస్తు ప్రకారం మీరు ఆఫీస్​లో ఉత్తరం లేదా తూర్పు వైపు చూస్తున్నట్లుగా కూర్చుంటే మంచిదట.
  • అలాగే వీలైనంత వరకు పిల్లర్ల కింద పనిచేయకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఆఫీస్‌లో మీకు పాజిటివ్‌ వాతావరణం ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
  • మీరు పనిచేసే డెస్క్‌ చుట్టూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఇంకా డెస్క్‌పైన అన్ని వస్తువులు చిందరవందరగా ఉండకుండా, క్లీన్‌గా సర్దుకోండి. ఇలా చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.
  • మీరు కూర్చునే కుర్చీ వాస్తు ప్రకారం కొంత ఎత్తులో ఉండాలి. అలాగే కుర్చీ వెనుక భాగం దృఢంగా ఉండేలా చూసుకోండి.
  • మీరు పని చేసే డెస్క్‌ దగ్గర తగినంత లైటింగ్‌ ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీపై సానుకూల శక్తి నిండి ఉంటుంది.
  • అలాగే మీ డెస్క్‌ దగ్గర వీలైతే చిన్న మొక్కలను పెంచుకోండి. దీనివల్ల మీ చుట్టూ పాజిటివ్‌ వాతావరణం నిండి ఉంటుంది.

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే! - vastu tips for home

  • డెస్క్‌ దగ్గర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు సంబంధించిన వైర్లు చిక్కులు లేకుండా చక్కగా ఉండేలా చూసుకోండి.
  • అలాగే మీరు పని చేసే ప్రదేశంలో మీకు ప్రేరణ కలిగించే వ్యక్తుల ఫొటోలను పెట్టుకోండి. మీకు నచ్చితే కుటుంబ సభ్యుల ఫొటోలు కూడా పెట్టుకోవచ్చు.
  • అలాగే డెస్క్‌ దగ్గర చిన్న లాఫింగ్‌ బుద్ధ విగ్రహం పెట్టుకుంటే ఇంకా మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
  • ఇంకా మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఆఫీస్‌లో ఉన్నప్పుడు కనీసం రెండు గంటలకు ఒకసారి చిన్న విరామం తీసుకోండి. అలాగే తరచూగా నీళ్లను తాగండి.
  • ఆఫీస్‌లో మీరు వర్క్‌ విషయంలో ఎంత బాగా పని చేసినా కూడా, తోటి ఉద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి. దీనివల్ల మీకు ఆఫీస్‌లో ప్రశాంతమైన వాతావరణం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇంటి ప్రహరీ గోడ కన్నా గేటు ఎత్తుగా ఉండొచ్చా? - వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది? - Vastu Rules For House Gate

మూఢం అంటే ఏంటి? - ఆ రోజుల్లో ఈ పనులు అస్సలే చేయకూడదు! - కానీ అవి చేయొచ్చట! - Importance of Moudyami 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.