ETV Bharat / spiritual

బీరువాలో డబ్బు, నగలు ఒకేచోట పెట్టకూడదు! వాస్తు ప్రకారం ఇలా చేస్తే మీ ఆదాయం రెట్టింపు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 6:38 PM IST

Vastu Tips For Increasing Income : మన దేశంలో వాస్తును నమ్మేవాళ్లు అనేక మంది ఉంటారు. ఇంటి నిర్మాణం దగ్గర్నుంచి అందులోని సామగ్రి ఏర్పాటు వరకు అంతా వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆదాయ మార్గాలు పెరగాలంటే వాస్తురీత్యా ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటిస్తే మన ఇన్​కమ్​ డబుల్​ అవుతుంది అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips For Increasing Income
Vastu Tips For Increasing Income

Vastu Tips For Increasing Income : వాస్తు ప్రకారం ఒక ఇంట్లో అత్యధికంగా నీళ్లు ఉపయోగిస్తే సంపద త్వరగా ఖర్చవుతుంది. అందువల్ల గృహంలోని పంపులు, కుళాయిలు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. బొట్టు బొట్టుగా పడ్డా చివరికి బకెట్లు నిండిపోతాయి. దీంతో అనేక రీతులుగా ఖర్చులు పెరుగుతాయి. ఎవరైనా సరే ఇంట్లో నీటిని పొదుపుగా వాడాలి. ఇలా చేసే వాళ్లపై లక్ష్మీ దేవీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మట్టి వస్తువులను ఆ స్థానంలో అస్సలు ఉంచకూడదు!
అలాగే ఇంటి గోడకు మన పూర్వీకుల చిత్ర పటాలు దక్షిణ దిక్కు వైపున పెట్టి నిత్యం వారికి నమస్కారం చేస్తే వారి ఆశీస్సులు మీపై ఉంటాయి. ఉత్తర దిశలో మట్టితో చేసిన బొమ్మలు మాత్రం ఎప్పుడూ ఉంచకూడదు. ఒకవేళ అలాంటివి ఉంటే వాటిని అక్కడి నుంచి తొలగించడం మంచిది. మట్టితో చేసినవి, ఉత్తర దిశ- ఈ రెండూ దురదృష్టాన్ని ఇస్తాయి. దానికి కారణం అది కుబేర స్థానం. కుబేరుడు ఐశ్వర్య కారకుడు. కాబట్టి ఎప్పుడూ కూడా మట్టికి సంబంధించిన వస్తువులు ఉత్తరంలో ఉండకూడదు.

చీపురు కూడా పెట్టకూడదు!
నీటి శక్తి ఆ ఉత్తర దిశలో ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ ఉద్యోగంలో ప్రతికూల వాతావరణాన్ని ప్రసాదిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే ఉత్తర దిశను, ఉత్తర ఈశాన్యాన్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్యంలో చీపురు కూడా ఉండటానికి వీళ్లేదని వాస్తు స్పష్టం చేస్తోంది. అలాగే ఈశాన్య దిశలో నీటి తొట్టిని అమర్చేటప్పుడు అది భూమి లోపలే ఉండాలి కానీ పైభాగాన నిర్మించకూడదు.

ఆ ఫొటోలు అస్సలు పెట్టకూడదు!
ప్రతి ఇంట్లో గ్లోబ్​ ఉంటే మంచిది. అది చదువుకునే పిల్లల గదిలో పెడితే వారికి తెలియకుండానే చదువుకోవాలన్న కోరిక పెరుగుతుంది. బయట భాగంలో ఉత్తరం వైపున తెల్లని పూల చెట్లు పెంచితే ఐశ్వర్య ప్రభావం వస్తుంది. మ్యూజిక్​ గడియారాలను దక్షిణం వైపు కాకుండా వేరే చోట్ల పెడితే అదృష్టాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణ దిశలో జల సంబంధిత చిత్రాలు ఏర్పాటు చేయవద్దు. వీటికి బదులుగా అక్కడ ఎరుపు రంగు చిత్రాలు పెట్టుకోవడం వల్ల లాభదాయకమైన ప్రభావాన్ని పొందగలరు.

రెండు ఒకేచోట పెట్టకూడదు!
నగదు దాచుకునే బీరువాలో కూడా డబ్బు, ఆభరణాలు ఒకే చోట ఉండకుండా చూసుకోండి. నగలు ఒక దగ్గర, నగదు ఒక్క దగ్గర ఉండేలా చూసుకోండి. అంతే కానీ ఇవి రెండూ ఒకే దగ్గర ఉండటం శ్రేయస్కరం కాదు. అంతేకాకుండా ఎరుపు రంగు కలిగిన 4 గురివింద గింజలు తీసుకుని వాటిని డబ్బు దాచుకునే బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనం పొదుపుగా వాడుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇంటి గేట్లు ఆ దిక్కున అస్సలు ఉండకూడదు- ఆ విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలివే!

శనిదేవుడికి బెల్లం నైవేద్యం- ఆంజనేయుడికి ఆకుపూజ- శనివారం ఇవి చేస్తే మీ సమస్యలన్నీ క్లియర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.