ETV Bharat / politics

రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్​ హీట్​ - నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న పార్టీలు - LOK SABHA ELECTION 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 7:10 AM IST

Political Heat in Telangana
Political Heat in Telangana

Political Heat in Telangana : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో వాడీవేడి ప్రచారాలు, సభలతో పొలిటికల్​ హీట్​ను తెప్పిస్తున్నారు.

రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్​ హీట్​ - నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న పార్టీలు

Political Heat in Telangana : సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనుండగా ప్రధాన పార్టీలు ప్రచారాల జోరు పెంచుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ఊరూవాడ చుట్టేస్తుండగా ముఖ్యనాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్‌షోలు, ర్యాలీలుగా ప్రజల్లోకి వెళ్తున్న అభ్యర్థులు తమకు ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు.

చేరికల్లో జోరుమీదున్న కాంగ్రెస్​ : ఈ మధ్య కొందరు మజ్లిస్‌తో కాంగ్రెస్ పార్టీ అవగాహన కుదుర్చుకుంటుందని అపోహలు సృష్టిస్తున్నారని అందులో ఏ మాత్రం వాస్తవం లేదని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన పులిమామిడి రాజు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం గూటికి(BJP Leaders Join in Congress) చేరారు. మెదక్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ తరుఫున నీలం మధు ముదిరాజ్‌ పోటీ చేస్తున్నారు.

అయితే పులిమామిడి రాజు కూడా ముదిరాజ్ సామాజిక వర్గం కావడంతో మెదక్‌ అభ్యర్థి గెలుపునకు మరింత సహకారం లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపేంచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌ పరిధిలోని లాలాపేట్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశానికి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ హాజరయ్యారు.

"సికింద్రాబాద్​ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తే రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తాం. సీఎం రేవంత్​ రెడ్డి, రాహుల్​ గాంధీ నేతృత్వంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీని మళ్లీ రావాలని కోరుతుంటున్నారు. కార్యకర్తలు ఈ విధంగానే ముందుకు వెళితే సికింద్రాబాద్​లో కచ్చితంగా కాంగ్రెస్​ జెండాను ఎగువవేస్తాం." - దానం నాగేందర్​, సికింద్రాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి

సీఎం గుంపు మేస్త్రీ అయితే ప్రధాని తాపీ మేస్త్రీ - ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు : కేటీఆర్

BRS Election Campaign in Telangana : మంచిర్యాల మార్కెట్ ప్రాంతంలో ప్రజలను కలుస్తూ తనను ఎంపీగా గెలిపించాలని బీఆర్​ఎస్​ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కరీంనగర్‌ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ సహా తదితరులు హాజరయ్యారు.

దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో ఎలా చెల్లుతుందని బీజేపీను ఉద్దేశించి మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని దుబ్బాక, సంగారెడ్డి, పఠాన్‌చెరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన యువజన ఆత్మీయ సమ్మేళనాల్లో(BRS Meetings) మాజీమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

"ఈరోజు అధికారంలో ఉన్న రేవంత్​ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మడం లేదు ఫేక్​ వార్తలు, లీక్​ వార్తలను నమ్మి రాజ్యం నడుపుతోంది. అటువంటి వాళ్లకు ఈసారి గుణపాఠం చెప్పాలి. రెండు పార్టీలది అదే కథ. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు జరిగిన ఒక్క మంచి పనినైనా ఉందా? నిరుద్యోగం, ఆకలి, రైతులకు నల్ల చట్టాలు తీసుకువచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకుంది బీజేపీ." - హరీశ్​రావు, మాజీ మంత్రి

ప్రచార జోరు పెంచిన బీజేపీ : ఎవరెన్ని కుట్రలు చేసినా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కమలం జెండాను ఎగరేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు. బర్కత్‌పురాలోని పార్టీ కార్యాలయంలో పలువురు బీఆర్​ఎస్​ నేతలు కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Election 2024) బీఆర్​ఎస్​కు ఓటుతో బుద్ధి చెప్పాలని కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. పట్టణంలోని 21వ డివిజన్‌లో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీది సుపరిపాలన కాంగ్రెస్‌ది సుపారీ పాలన అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ విమర్శించారు.

హైదరాబాద్‌ కొత్తకోటలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో మల్గాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన బూత్‌ కమిటీ సభ్యుల సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్‌ అబయ్‌ పాటిల్‌, పార్టీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్‌ హాజరయ్యారు. ఖమ్మంలో కమలం వికసిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధీమావ్యక్తం చేశారు. ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్, కేటీఆర్​తో దోస్తాని - ఇద్దరికి నన్ను ఓడించాలే అని ఉంటది : బండి సంజయ్

ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు రేవంత్ సైన్యం సిద్ధం - వాటికి ఆధారాలతో కూడిన కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.