ETV Bharat / politics

'తెలంగాణలో బీజేపీ పెరుగుతోంది - కాంగ్రెస్, బీఆర్ఎస్ తగ్గుతున్నాయి'

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 12:07 PM IST

Updated : Mar 18, 2024, 1:27 PM IST

PM Modi
PM Modi

PM Modi Speech in Jagtial Vijaya Sankalpa Sabha : దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. గత మూడు రోజుల్లో తాను రాష్ట్రానికి రావడం ఇది రెండోసారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ పెరుగుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ తగ్గుతున్నాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం

PM Modi Speech in Jagtial Vijaya Sankalpa Sabha : ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల నగారా మోగిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మొదలైందని చెప్పారు. అతిపెద్ద ప్రజాస్వామ్య ఉత్సవం ప్రారంభమైందని వివరించారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని అన్నారు. దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొని మోదీ మాట్లాడారు.

'వచ్చే ఐదేళ్లలో జెట్​ స్పీడ్​లో అభివృద్ధి- ఇండియా కూటమికి నిద్రపట్టడం లేదు!'

'తెలంగాణలో బీజేపీకి ప్రజలు పెద్దఎత్తున మద్దతు ఇస్తున్నారు. గత మూడు రోజుల్లో నేను తెలంగాణకు రావడం ఇది రెండోసారి. తెలంగాణ కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. తెలంగాణలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవల శ్రీకారం చుట్టాం. రాష్ట్రం నలుమూలల నుంచి కమలం పార్టీకి మద్దతు పెరుగుతోంది. మాల్కాజ్‌గిరిలోని బీజేపీ ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరుగుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ (Modi Fires on Congress and BRS) తగ్గుతున్నాయని' మోదీ అన్నారు.

వారసత్వ నేతల అవినీతిని వెలికితీస్తున్నా - అందుకే వారికి భయం పట్టుకుంది : మోదీ

Modi Fires on Congress and BRS : జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని మోదీ పేర్కొన్నారు. బీజేపీకి 400కు పైగా సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం కమలం పార్టీకి ఓటు వేయాలని తెలుగులో కోరారు. శక్తి రూపంలో మహిళలు తనను ఆశీర్వదించేందుకు వచ్చారని ఇది తన భాగ్యమని చెప్పారు. ఆదివారం ముంబయిలో ఇండియా కూటమి ర్యాలీ జరిగిందని, ఆ కూటి శక్తి నాశనాన్ని కోరుకుంటుందని ఆరోపించారు.

"ఇండియా కూటమి శక్తి నాశనాన్ని కోరుకుంటోంది. శక్తి నాశనం కోరుకునేవారు గెలుస్తారో, శక్తిని పూజించేవారు గెలుస్తారో జూన్‌ 4న తేలుతుంది. నేను భారతమాత పూజారిని. శక్తిస్వరూపులైన ప్రతి మాత, సోదరి, కుమార్తెల పూజారిని. శక్తిస్వరూపులైన మహిళల రక్షణ కోసం నేను ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం. తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే, మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం." - మోదీ, ప్రధాని

తెలుగువారు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారు : తెలంగాణలో బీజేపీ గెలిపించే గ్యారంటీ మీరు ఇవ్వాలని ప్రజలను మోదీ కోరారు. అలాగైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే హామీని తాను ఇస్తానని చెప్పారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు తీసుకొచ్చామని, తెలంగాణలో లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని గుర్తు చేశారు. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ తెలుగువారు ఉన్నారని, వారు అక్కడ మంచి స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. తెలుగువారు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కమలం పార్టీ ఎంపీ అభ్యర్థులను సభికులకు పరిచయం చేసిన మోదీ బండి సంజయ్‌, అర్వింద్‌, శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ మధ్య తెలంగాణ నలిగిపోయింది : ప్రధాని మోదీ

మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్​షో - కాషాయమయమైన రహదారులు

Last Updated :Mar 18, 2024, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.