ETV Bharat / politics

నోటీసులు నాకు ఎందుకు, కోమటిరెడ్డికి పంపండి : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 3:35 PM IST

Updated : Jan 31, 2024, 10:19 PM IST

KTR Counter to Manickam Tagore
KTR Tweet on Manickam Tagore :

KTR Tweet on Manickam Tagore : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాజీ ఇంఛార్జి మాణికం ఠాగూర్​పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై పరువు నష్టం దావా వేస్తానన్న మాణికం ఠాగూర్ వ్యాఖ్యలపై ఎక్స్​ వేదికగా స్పందించారు. నోటీసులు ఎవరికి పంపాలో తెలియని అయోమయంలో ఉన్నారని, తప్పుడు అడ్రస్​కు పంపినట్లు కేటీఆర్ ఎద్దేవా చేశారు.

KTR Tweet on Manickam Tagore : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాజీ ఇంఛార్జి మాణికం ఠాగూర్​పై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పైన పరువు నష్టం దావా వేస్తానన్న మాణికం ఠాగూర్​ వ్యాఖ్యలపై ఎక్స్‌(Twitter) వేదికగా కేటీఆర్ రీట్వీట్‌ చేశారు. నోటీసులు ఎవరికి పంపాలో తెలియని అయోమయంలో మాణికం ఠాగూర్​ ఉన్నారని, తప్పుడు అడ్రస్​కు పంపినట్లు కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలి : కేటీఆర్‌

మాణికం ఠాగూర్​ తోటి కాంగ్రెస్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీకు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పిన మాటలను తాను గుర్తు చేశానని కేటీఆర్ పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన రూ. 50 కోట్ల లంచం వార్తలనే తాను ప్రస్తావించానని తెలిపారు. అయితే జనవరి 28న సిరిసిల్లలో కేటీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలకు గానూ నోటీసులు పంపినట్లు మాణిక్కం ఠాగూర్ తెలిపారు.

KTR Counter to Manickam Tagore : కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని, కోమటిరెడ్డి తాను చేసిన రూ.50 కోట్ల లంచం వ్యాఖ్యల పైన వివరణ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి(Minister Komatireddy Venkat Reddy) పంపిస్తే బాగుంటుందన్నారు. తన చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండని కేటీఆర్ సూచించారు.

గతంలోనూ అవే ఆరోపణలు : నాడు నిరాధార ఆరోపణలు చేసినందుకు గానూ, తన పరువుకు భంగం కలిగించారంటూ, అప్పటి కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్కం ఠాగూర్​, ఎల్బీనగర్ మాజీ​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డికి లీగల్​ నోటిస్​(Legal Notices) పంపారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే న్యాయపరంగా ముందుకెళ్తానని హెచ్చరించారు. పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డిపై, సుధీర్​రెడ్డి పలు విమర్శలు చేశారు.

అందులో భాగంగా మాణిక్కం ఠాగూర్​కు రూ.25 కోట్ల లంచం ఇచ్చి రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్ష​ పదవి తెచ్చుకున్నారని సుధీర్​రెడ్డి ఆరోపించారు. నాటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాణిక్కం ఠాగూర్​, నిరాధారమైన ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ లీగల్​ నోటీస్​ పంపారు. తనపై సుధీర్​రెడ్డి చేసిన ఆరోపణలు పలు ఆంగ్ల, తెలుగు పత్రికలు, ఎలక్ట్రానిక్​ మీడియాలో ప్రసారమయ్యాయని మాణిక్కం పేర్కొన్నారు.

కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ ఫుల్ ఫైర్ - సందీప్‌రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్

హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ - అధికారం చేతుల్లోనే ఉందిగా వెలికితీయండి : కేటీఆర్‌

Last Updated :Jan 31, 2024, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.