ETV Bharat / city

Legal notice: ఎమ్మెల్యే సుధీర్​రెడ్డికి.. కాంగ్రెస్​ రాష్ట్ర ఇంఛార్జ్​ లీగల్​ నోటీస్​

author img

By

Published : Jul 11, 2021, 6:20 AM IST

నిరాధార ఆరోపణలు చేసి, తన పరువుకు భంగం కలిగించారంటూ.. కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్​.. ఎల్బీనగర్​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డికి లీగల్​ నోటిస్​ పంపారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే న్యాయపరంగా ముందుకెళ్తానని హెచ్చరించారు.

manikkam tagore
manikkam tagore

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డికి.. కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా చేసిన ఆరోపణలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల లోపల క్షమాపణలు చెప్పకుంటే కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు.

ఈనెల 3న.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై.. సుధీర్​రెడ్డి పలు విమర్శలు చేశారు. అందులో భాగంగా మాణిక్కం ఠాగూర్​కు రూ.25 కోట్ల లంచం ఇచ్చి రేవంత్​రెడ్డి పీసీసీ చీఫ్​ పదవి తెచ్చుకున్నారని సుధీర్​రెడ్డి ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాణిక్కం ఠాగూర్​.. నిరాధారమైన ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ లీగల్​ నోటీస్​ పంపారు. తనపై సుధీర్​రెడ్డి చేసిన ఆరోపణలు... పలు ఆంగ్ల, తెలుగు పత్రికలు, ఎలక్ట్రానిక్​ మీడియాలో ప్రసారమయ్యాయని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పకుంటే న్యాయపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు.

ఇదీచూడండి: HARISH RAO: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.