ETV Bharat / politics

హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ - అధికారం చేతుల్లోనే ఉందిగా వెలికితీయండి : కేటీఆర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 5:39 PM IST

Updated : Jan 28, 2024, 7:27 PM IST

KTR Speech at BRS Party Meeting in Siricilla : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ అల్లుతుందని ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగివుంటే, వెలికితీయమనే చెబుతున్నామని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు.

KTR Comments on CM Revanth Reddy
KTR Speech at BRS Party Meeting in Siricilla

KTR Speech at BRS Party Meeting in Siricilla : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ అల్లుతుందని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగి ఉంటే, వెలికి తీయమనే చెబుతున్నట్లు ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

గతంలో చాలామంది బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌, గులాబీ పార్టీని తొక్కేస్తామని విమర్శించి ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులో(Medigadda Project) అవినీతి, మరోచోట అక్రమాలు జరిగాయని కథలు చెబుతున్నారని తెలిపారు. అధికారం వారి చేతుల్లోనే ఉందని, అవినీతిని వెలికితీయమనే చెబుతున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలి : కేటీఆర్‌

అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటే మాత్రం వదిలిపెట్టమని ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ(Free Bus Travel) పథకంలో భాగంగా బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. దీని వల్ల నష్టపోతున్న ఆటో సోదరులను సైతం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్‌ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదన్నారు.

కేసీఆర్ అధికార ప్రభుత్వంలో కంటే, ప్రతిపక్ష హోదాలో ఉంటేనే చాలా ప్రమాదం. ఎందుకంటే అద్భుతంగా ప్రజల పక్షాన చీల్చి చెండాటంలోనూ, సమస్యలపై గొంతు విప్పటంలోనూ కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో తొక్కుతానంటున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేయాలని కలలు కంటున్నారు. గతంలో పెద్ద పెద్దవాళ్ల వల్లే కాలేదు ఇలాంటి వారివల్ల ఏమైనా అవుతుందా? -కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

KTR Comments on CM Revanth Reddy : బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్​ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. కాలం కలిసివస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలుకొడతాయని వారిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌(KCR) లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, దిల్లీ మేనేజ్​మెంట్​ కోటాలో నియమితుడైన సీఎం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

అధికారం మీ చేతులోనే ఉంది - అవినీతిని వెలికితీయమనే చెబుతున్నాం: కేటీఆర్‌

పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు : శాసనసభ సమావేశాల్లో మెజారిటీ ఎందుకు తగ్గిందో చర్చించి, లోపాలను మార్చుకుందామని కేటీఆర్ అన్నారు. ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్స్ ఉన్నాయని, వాటిలో మీకోసం మీకంటే ఎక్కువ తానే కష్టపడుతానని కేటీఆర్ తెలిపారు. నూతన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్న వినోద్ కుమార్, బండి సంజయ్​ల(BJP MP Bandi Sanjay) పనితీరును పోల్చుకొని అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. బీజేపీ ఎంపీ ఇప్పటి వరకు తిరగని మండలాలు కూడా ఉన్నాయని కేటీఆర్ వివరించారు. ధర్మం మీద పని చేసేది ఉంటే రాజకీయం మానుకోమని సంజయ్​ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్‌ చేసిన మంచి ప్రజల్లోకి వెళ్లలేదు - కాంగ్రెస్​ పార్టీ అబద్ధాలను రీల్స్‌ చేసి వదులుతోంది : హరీశ్‌రావు

కారు వదిలి ఆటోలో ప్రయాణించిన కేటీఆర్

Last Updated : Jan 28, 2024, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.