ETV Bharat / politics

ఓటు అడిగేందుకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్​ నాయకులను ప్రజలు నిలదీయాలి : హరీశ్​రావు - Harish Rao Election Campaign

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 6:05 PM IST

Harish Rao Fires on congress
Harish Rao Fires on BJP

Harish Rao Fires on BJP : ఓటు అడిగేందుకు వచ్చే బీజేపీ నాయకులను పదేళ్లలో ఏం చేశారో నిలదీయాలని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. దశాబ్ద కాలంలో రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చకుండా మోదీ సర్కార్‌ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన, 6 గ్యారంటీలను రేవంత్‌ ప్రభుత్వం అటకెక్కించిందని ఆక్షేపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌కు, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Harish Rao Fires on BJP : పార్లమెంట్​ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్​ నాయకులను ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు కోరారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఏం చేసిందో ప్రశ్నించాలన్నారు. మోదీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న ఆయన, జీఎస్టీ వేసి నిత్యావసరాల రేట్లు పెంచారని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కొడంగల్​ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది : ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుతో ఆకలి, నిరుద్యోగం, పేదరికం అన్నీ పెరిగాయని హరీశ్​రావు ఆరోపించారు. పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలిస్తామని భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆక్షేపించారు. బీజేపీకి చెప్పుకోవడానికి పథకాలే లేవన్న ఆయన, మోదీ సర్కార్​ తెలంగాణకు ఒక్క మెడికల్‌ కళాశాల అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. దేశంలో 157 మెడికల్‌ కళాశాలలిస్తే, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. నవోదయ విద్యాలయాలు అడిగితే ఇవ్వలేదని, అలాంటి పార్టీకి ఓటు ఎందుకు వేయాలో ఆ పార్టీ నేతలను అడగాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలకు సూచించారు.

కాషాయ పార్టీ మేనిఫెస్టో పేరు గొప్ప - ఊరు దిబ్బలా ఉంది : హరీశ్‌రావు

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు, 13 హామీలిచ్చిందని హరీశ్​ రావు గుర్తు చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందని, చెప్పిన గడువు దాటినా హామీల అమలుపై ధ్యాసే లేదని దుయ్యబట్టారు. మొదటి సంతకం ఆరు గ్యారంటీలపైనే పెడతానన్న రేవంత్​ రెడ్డి, అమలులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని నిలదీశారు. ఏమీ చేయని కాంగ్రెస్‌, ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు.

'పదేళ్ల కేసీఆర్​ పాలనలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు లేవు - కాంగ్రెస్ వచ్చింది - కరవు మొదలైంది'

బీజేపీ ప్రజలకు ఏం చేసిందో ప్రశ్నించండి. మోదీ హయాంలో ఆకలి, నిరుద్యోగం, పేదరికం అన్నీ పెరిగాయి. పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు. ఉద్యోగాలిస్తామని చెప్పి బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది. ఆ పార్టీకి చెప్పుకోవడానికి పథకాలే లేవు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, 13 హామీలిచ్చింది. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇంకా చేయలేదు. ఏమీ చేయని కాంగ్రెస్‌ ఓట్లు ఎలా అడుగుతుంది. - హరీశ్​రావు

ఓటు అడిగేందుకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్​ నాయకులను ప్రజలు నిలదీయాలి : హరీశ్​రావు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులైనా రుణమాఫీ చేయలేదు : హరీశ్​రావు

నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని అప్పుడే మాట మార్చారు : హరీశ్‌రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.