ETV Bharat / politics

'పదేళ్ల కేసీఆర్​ పాలనలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు లేవు - కాంగ్రెస్ వచ్చింది - కరవు మొదలైంది' - BRS Harish Rao On crop drought

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 3:40 PM IST

Updated : Apr 11, 2024, 5:21 PM IST

Harish Rao Guarantees Declared For Farmers
BRS Leader Harish Rao On crop drought in Telangana

BRS Leader Harish Rao On crop drought in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్​ వచ్చిందని, రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. సాగు నీరు లేక రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

BRS Leader Harish Rao On crop drought in Telangana : తెలంగాణలో కాంగ్రెస్​ వచ్చిందని, కరవు మొదలైందని, రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చిందన్న ఆయన, గడ్డి కేంద్రాలను పెట్టి పశువులను కాపాడుకునే స్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్​ పాలనలో కరవే లేదని గుర్తు చేశారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలన్నారు, కానీ అమలు కాలేదని విమర్శించారు.

"వెంకట రామి​రెడ్డి గెలుపు చాలా ముఖ్యం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏపాటిదో ప్రజలకు అర్థమైంది. వైఎస్ ఉన్నపుడు ఆరు గంటల కరెంటు ఇస్తే, రూ.90 వేల కోట్లు ఖర్చు చేసి కెసిఅర్ 24 గంటల కరెంట్ ఇచ్చారు. సాగు నీటి కష్టాలు తొలగించింది కేసీఆర్. అప్పుడు నిండా చూసిన జలాశయాలు, ఇప్పుడు ఎండిపోయి చూస్తున్నాం. గడ్డిని కూడా నాడు ఆంధ్ర నుంచి తెచ్చి పశువులను కాపాడుకున్నం. కేసిఆర్ కాలు పెడితే పదేళ్లు కరువు లేదు. కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కరువు తెచ్చింది. ఏ ఒక్క హామిని కాంగ్రెస్ నెరవేర్చలేదు. మీరు మాకు ఎంపి సీట్లు ఇస్తే హామీల గురించి నిలదీస్తాం." - హరీశ్​ రావు, మాజీ మంత్రి

పదేళ్ల కేసీఆర్​ పాలనలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు లేవు కాంగ్రెస్ వచ్చింది కరవు మొదలైంది

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హామీ ఏమైనట్టు : కేటీఆర్ - KTR On Congress BC Declaration

BRS Harish Rao Election Campaign in Medak : బీజేపీ నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు నష్టం చేసిందని హరీశ్​ రావు అన్నారు. ఉపఎన్నికలో వారు అనేక హామీల పేరిట అరచేతిలో వైకుంఠం చూపించారని మండిపడ్డారు. దుబ్బాకలో చెల్లని వ్యక్తి ఇక్కడ ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. మరోవైపు సీఎం రేవంత్​ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎన్నడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్​ రెడ్డి అలాంటి వారు సీఎం అయ్యారన్నారు. జై తెలంగాణ అనే వాళ్లను కాల్చి పడేస్తా అన్నారని మండిపడ్డారు. గోదావరి నీళ్లు వచ్చి పంటలు పండితే ముద్ద తింటున్నామని, నోటి కాడ బుక్క పోగొడుతున్నారని విమర్శించారు. నిజమైన రైతు నేస్తం కేసీఆర్​ అని అన్నారు.

'మోసాలు చేసిన కాంగ్రెస్​కు ఎలా ఓటు వేస్తారు. పేద విద్యార్థుల చదువు కోసం రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని వెంకట రామిరెడ్డి అంటున్నారు. కార్యకర్తల ఇళ్లల్లో పెళ్లిళ్లు అయితే ఉచిత ఫంక్షన్ హాల్ సేవలు ప్రకటించారు. 30 రోజులు కష్టపడితే ఇద్దరం కలిసి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చేస్తాం. కార్యకర్తలెవరూ ఆగం కావొద్దు. బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నా' అని హరీశ్​ రావు అన్నారు.

నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని అప్పుడే మాట మార్చారు : హరీశ్‌రావు - Harish Rao Fires on Congress Party

BRS MP Candidates Venkatram Reddy Guarantees : పార్లమెంట్​లో తెలంగాణ గళం విప్పుతానని, రాష్ట్ర సమస్యలకు పరిష్కారం చూపుతానని మెదక్​ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట రామిరెడ్డి అన్నారు. ఎక్కడైతే కలెక్టర్​గా పని చేశానో, అక్కడి నుంచి పార్లమెంట్​కు వెళ్లే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అధికారిగా సేవలు అందించిన తాను, ఇక మీదట ఎంపీగా సేవలు అందిస్తానని ఆశా భావం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల కష్టసుఖాలు తెలుసని, తుది శ్వాస వరకు ప్రజా సేవలో ఉంటానని తెలిపారు. విద్య ప్రాముఖ్యత తనకు తెలుసని, పేద పిల్లల కష్టం తీర్చేలా రూ.100 కోట్లతో ట్రస్ట్​ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత 15 రోజుల్లో ట్రస్ట్​ రిజిస్ట్రేషన్, 30 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభిస్తానని ప్రమాణం చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మంచి ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తానని అన్నారు.

కాంగ్రెస్ హామీలు నీటి బుడగలే అని అర్థం అవుతోంది : జగదీశ్​రెడ్డి - ex minister Jagadish Reddy

Last Updated :Apr 11, 2024, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.