కలెక్టర్‌గా ప్రజలకు చేసిన మంచి పనులే నన్ను ఎంపీగా గెలిపిస్తాయి : వెంకట రామిరెడ్డి - Medak BRS MP Candidate Interview

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 12:46 PM IST

thumbnail

Face2Face with Medak BRS MP Candidate : ఉమ్మడి మెదక్‌లో కలెక్టర్‌తో పాటు వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం, ప్రజలకు చేసిన మంచి పనులు తనను ఎంపీగా గెలిపిస్తాయని మెదక్‌ పార్లమెంట్‌ బీఆర్​ఎస్​ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తాను గెలిచిన నెల రోజుల్లోనే రూ.100 కోట్లతో పీవీఆర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, పేద విద్యార్థుల చదువుల కోసం ఉపయోగిస్తామని వెల్లడించారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి రూ.2 కోట్లతో కల్యాణ మండపాలను ఏర్పాటు చేసి, కార్యకర్తల కుటుంబ శుభకార్యాలకు ఉచితంగా అందిస్తానని వాగ్దానం చేశారు. 

Medak BRS MP Candidate Venkatrami Reddy Interview : కొండ పోచమ్మ, రంగనాయకమ్మ నిర్వాసితులకు అండగా ఉంటానని బీఆర్​ఎస్​ అభ్యర్థి వెంకటరామిరెడ్డి హామీ ఇచ్చారు. మెదక్​ జిల్లా కలెక్టర్​గా పని చేసిన అనుభవంతో అధికారులతో మాట్లాడి నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. కచ్చితంగా ఈ పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న వెంకట రామిరెడ్డితో ఈటీవీ భారత్ ప్రత్యేక​ ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.