ETV Bharat / politics

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు- బరిలోకి 525 మంది అభ్యర్థులు - lok sabha elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 8:03 PM IST

Updated : Apr 29, 2024, 9:47 PM IST

Lok Sabha Elections 2024
Nominations withdraws Ended Today

Nominations withdraws Ended Today : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ముగిసిన తరువాత 17 నియోజకవర్గాల్లో 525 మంది బరిలో నిలిచారు. ఇవాళ చివరిరోజు పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరిలో అత్యధికంగా మల్కాజిగిరి స్థానం నుంచి 15 మంది ఉపసంహరించుకోగా, అత్యల్పంగా ఆదిలాాబాద్, సికింద్రాబాద్ నుంచి ఒక్కరు చొప్పున ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.

Lok Sabha Elections 2024 : లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వంద మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 17 పార్లమెంటు స్థానాల్లో 525 మంది పోటీలో నిలిచారు. మల్కాజిగిరిలో అత్యధికంగా 15 మంది, భువనగిరిలో 12, మెదక్, నల్గొండలో తొమ్మిది మంది, హైదరాబాద్​లో ఎనిమిది మంది, పెద్దపల్లి, జహీరాబాద్​లో ఏడుగురు, వరంగల్, ఖమ్మంలో ఆరుగురు, కరీంనగర్​లో ఐదుగురు, మహబూబ్​నగర్​లో నలుగురు, నిజామాబాద్, చేవెళ్లలో ముగ్గురు, నాగర్​కర్నూలు, మహబూబాబాద్​లో ఇద్దరు, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లో ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు.

'EVM ఓట్లతో VVPAT స్లిప్పులను 100 శాతం సరిపోల్చడం కుదరదు'- సుప్రీం కోర్టు కీలక తీర్పు - SC Judgment On EVM VVPAT

నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అత్యధికంగా సికింద్రాబాద్​లో 45 మంది, అతితక్కువగా ఆదిలాబాద్​లో 12 మంది పోటీలో ఉన్నారు. పెద్దపల్లిలో 42, కరీంనగర్​లో 28, నిజామాబాద్​లో 29, జహీరాబాద్​లో 19, మెదక్​లో 44, మల్కాజిగిరిలో 22, హైదరాబాద్​లో 30, చేవెళ్లలో 43, మహబూబ్​నగర్​లో 31, నాగర్​కర్నూలులో 19, నల్గొండలో 22, భువనగిరిలో 39, వరంగల్ లో 42, మహబూబాబాద్ లో 23, ఖమ్మంలో 35 మంది లోక్​సభ బరిలో ఉన్నారు.

CEO Vikas Raj on Polling Arrangements : మరోవైపు రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ తెలిపారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు.

ఎన్నికల వేళ రాష్ట్రానికి చేరుకున్న బలగాలు: రాష్ట్రానికి ఎన్నికల కారణంగా 155 కంపెనీల సాయుధ బలగాలు వచ్చాయని మరో 50 కంపెనీలను కేటాయించాలని కోరినట్లు వివరించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 375 కంపెనీల బలగాలు వచ్చాయని తెలిపారు. ఈ దఫా దేశవ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్‌ జరగనుండటంతో వాటి సంఖ్య తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 60 వేల యూనిఫాం సర్వీసు ఉద్యోగులతో పాటు, పక్క రాష్ట్రాల నుంచి 20 వేల పోలీసు బలగాలు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు.

నకిలీ ఓట్లపై ఈసీ ఫోకస్‌- హైదరాబాద్‌లో ఎన్ని ఓట్లు తొలగించారంటే? - telangana election commission

హైదరాబాద్‌ లోక్​సభ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ ప్రత్యేక దృష్టి - ఓటింగ్‌ శాతం పెంచేలా చర్యలు - Lok Sabha Elections 2024

Last Updated :Apr 29, 2024, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.