ETV Bharat / politics

కడియం శ్రీహరితో కాంగ్రెస్​ నేతల భేటీ - త్వరలో నిర్ణయం వెల్లడిస్తానన్న ఎమ్మెల్యే - Congress Leaders Meets Kadiyam

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 1:06 PM IST

Updated : Mar 29, 2024, 5:21 PM IST

Congress Leaders Meet MLA Kadiyam Srihari : బీఆర్​ఎస్​ సీనియర్‌ నాయకుడు, ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమైంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ కడియం శ్రీహరిని కలిసి, హస్తం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యకర్తలతో సమాలోచనల తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని కడియం వెల్లడించారు.

Congress Leaders Meets MLA Kadiyam Srihari
కడియం శ్రీహరితో కాంగ్రెస్​ నేతల భేటీ - పార్టీలో చేరికపై మంతనాలు!

కడియం శ్రీహరితో కాంగ్రెస్​ నేతల భేటీ - త్వరలో నిర్ణయం వెల్లడిస్తానన్న ఎమ్మెల్యే

Congress Leaders Meet MLA Kadiyam Srihari : మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ సీనియర్‌ నేత కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరటం దాదాపు ఖాయమైంది. కడియం కుమార్తె, వరంగల్ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా, కాంగ్రెస్ నాయకులు శ్రీహరితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్​ క్వార్టర్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలకు, కడియం సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్‌, పీసీసీ నేతలు మల్లు రవి, సంపత్ కుమార్, హైదరాబాద్​ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి కడియంను కలిసి, కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీలోకి రావాల్సిందిగా కోరామని దీపాదాస్‌ మున్షీ తెలిపారు.

కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఏఐసీసీ తరఫున వచ్చాం. పార్టీని బలోపేతం చేసేందుకు వారిరువురు కాంగ్రెస్‌లో చేరతారని ఆశిస్తున్నాం. ఏఐసీసీ, పీసీసీ నాయకులంతా కడియం శ్రీహరిని కలిశాం. వారి నుంచి వచ్చే సమాధానం కోసం వేచి చూస్తున్నాం. - దీపాదాస్​ మున్షీ, కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ

మరోవైపు కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్​ నేతలతో సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన, బీఆర్​ఎస్​ ప్రజల్లో ఆదరణ కోల్పోతుందని వ్యాఖ్యానించారు. అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశమై, వారి అభిప్రాయం మేరకు నిర్ణయం ప్రకటిస్తానని కడియం వెల్లడించారు.

ప్రజాబలం ఉంటే కడియం శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి : బీఆర్ఎస్ నేతలు

బీఆర్​ఎస్​ తరఫున పోటీ చేయలేనన్న కావ్య : వరంగల్ లోక్‌సభ స్ధానంలో బీఆర్​ఎస్​ తరపున పోటీకి దిగిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. పార్టీ నాయకత్వంపై వస్తున్న అవినీతి, భూ కబ్జా ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్, మద్యం కుంభకోణం తదితర అంశాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని, ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లాలోనూ స్ధానిక నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేదని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం వల్ల పార్టీకి మరింత నష్టం చేకూరుతోందని కావ్య తన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేనని భావించి వైదొలుగుతున్నానని కేసీఆర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మన్నించాలని లేఖలో చెప్పారు.

ఎన్నికల ముంగిట బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్‌ - వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య

అదే స్థానం నుంచి కాంగ్రెస్​ తరఫున పోటీ : వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేయనున్నారు. ఇదిలా ఉండగా, సీనియర్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్​ఎస్​ను వీడతారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతుండగా, కాంగ్రెస్ నేతలు పలువురు కడియంతో మంతనాలు జరిపి కావ్యకు టిక్కెట్ ఇప్పించేలా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బీఆర్ఎస్​కు వరుస షాక్​లు - కాంగ్రెస్‌లో భారీ చేరికలు - హస్తంతో టచ్‌లో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు!

Last Updated :Mar 29, 2024, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.