ETV Bharat / politics

ఎన్నికల ముంగిట బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్‌ - వరంగల్‌ ఎంపీ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య - Kadiyam Kavya Drops Lok Sabha Seat

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 10:52 PM IST

Updated : Mar 29, 2024, 7:01 AM IST

Kadiyam Kavya Dropped Lok Sabha Elections 2024 : సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్‌ ఎంపీలు పార్టీని వీడగా ఇప్పుడు వరంగల్‌ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి వైదొలిగారు. భారత్ రాష్ట్ర సమితిపై వస్తున్న అవినీతి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దిగజారిందని, ఓరుగల్లు నేతల మధ్య కూడా సమన్వయం లేదని కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆమె ఆరోపించారు. మరోవైపు స్టేషన్‌ఘన్‌పూర్‌ గులాబీ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. వరంగల్‌ నుంచి కడియం కావ్యకు టికెట్ ఖరారు కావడంతోనే బీఆర్ఎస్‌కు షాక్‌ ఇచ్చారు.

KADIYAM KAVYA LETTER ON KCR
Kadiyam Kavya withdraw MP Nomination

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలు

Kadiyam Kavya Dropped Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో అధికారం కోల్పోయిన భారత్ రాష్ట్ర సమితి (BRS Leaders Migration in Telangana) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య బీఆర్ఎస్‌ను దిగ్భ్రాంతికి గురి చేశారు. గులాబీ పార్టీ తరఫు నుంచి పోటీ చేయలేనని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు.

Kadiyam Kavya To Join Congress అవినీతి ఆరోపణలు, ఫోన్‌ ట్యాపింగ్‌, దిల్లీ మద్యం కుంభకోణం వంటి అంశాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లాలోనూ స్ధానిక నాయకుల మధ్య సమన్వయం కొరవడి ఎవరికే వారే అన్నట్లుగా వ్యవహరించడంతో మరింత నష్టం జరుగుతోందని వివరించారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని కేసీఆర్, పార్టీ నేతలు, కార్యకర్తలు మన్నించాలని అన్నారు. తనకు బీఆర్​ఎస్​ నుంచి పోటీకి అవకాశం ఇచ్చినందుకు కడియం కావ్య (Kadiyam Kavya in Lok Sabha Polls) ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్ ఖరారు కావడంతోనే కావ్య గులాబీ పార్టీకి షాక్‌ ఇచ్చారు.

తెలంగాణ కోసం పోరాడి విజయం సాధించినోళ్లం - పార్లమెంట్ ఎన్నికలు ఓ లెక్కనా : పద్మారావు గౌడ్‌ - lok sabha Elections 2024

Lok Sabha Elections 2024 : స్టేషన్‌ఘన్‌పూర్‌ గులాబీ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో మంతనాలు జరిపిన హస్తం పార్టీ నేతలు కావ్యకు టికెట్‌ ఇప్పించేలా హామీ ఇచ్చారు. మొదటి నుంచి వరంగల్‌ స్థానంలో తన కుమార్తె కావ్యను బరిలో నిలపాలని కడియం శ్రీహరి భావించినా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ కోసం వెనక్కి తగ్గారు. అయితే ఆరూరి బీజేపీ గూటికి చేరడంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. మూడు రోజుల కింద కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు సైతం చెప్పారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో పునరాలోచనలో పడిన కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. వరంగల్ స్థానంలో దీటైన అభ్యర్థి కోసం చూస్తున్న కాంగ్రెస్ కడియం కావ్యను అవకాశం కల్పించినట్లు సమాచారం.

సార్వత్రిక సమరం 2024 - నేతల ఘాటు విమర్శలతో వేడెక్కిన రాజకీయం - ‍Lok Sabha Election 2024

BRS MP Candidates List 2024 : వరంగల్ జిల్లాలో ఒక్కొక్కరుగా కారు దిగుతున్న బీఆర్ఎస్‌ నేతలు అధినాయకత్వానికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్ హస్తం గూటికి చేరారు. పోను పోనంటూనే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితిని వీడారు. తాజాగా కడియం శ్రీహరి సైతం అదే బాటలో పయనించడం ఓరుగల్లులో గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారనుంది.

ఏప్రిల్ 13న చేవెళ్లలో కేసీఆర్ బహిరంగ సభ : కేటీఆర్ - KCR CHEVELLA PUBLIC MEETING

ఎన్నికల ప్రచార జోరు పెంచనున్న కారు - కార్యాచరణపై గులాబీ నేతల కసరత్తు - BRS Strategy on MP Elections

Last Updated :Mar 29, 2024, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.