ETV Bharat / politics

కాంగ్రెస్​ సర్కార్​లోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లు​ ట్యాపింగ్​ చేస్తున్నారన్న ఈటల - చిల్లర మాటలు మానుకోవాలన్న సీఎం రేవంత్

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 4:53 PM IST

CM Revanth Counter to Etela on Phone Tapping Issue : రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్​ రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై తాజాగా బీజేపీ నేత ఈటల రాజేందర్​, సీఎం రేవంత్​ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వం మాదిరిగా, కాంగ్రెస్​ సర్కార్​ కూడా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ల​ ట్యాపింగ్​కు పాల్పడుతుందంటూ ఈటల ఆరోపించగా, మాజీ మంత్రి చిల్లర మాటలు మానుకోవాలని రేవంత్​ రెడ్డి చురకలు అంటించారు.

CM Revanth Fires On BJP
CM Revanth Counter to Etela on Phone Tapping Issue

CM Revanth Counter to Etela on Phone Tapping Issue : సీఎం రేవంత్‌ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డంపెట్టుకొని దౌర్జన్యం చేస్తే, గత పాలకులకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్​లో పలు కాలనీ సంఘాలు (Colony Societies) ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఈటల, రేవంత్​ సర్కార్​పై సంచలన ఆరోపణలు చేశారు.

గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్​ల మాదిరిగా, కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతల ఫోన్​లు ట్యాపింగ్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ (Congress Party High Command) మెప్పు పొందడానికి బిల్డర్లను, వ్యాపారవేత్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబర్ధార్ అంటూ ఈటల హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, దేశ ప్రజలకు ధైర్యాన్ని అందించిన నాయకుడు నరేంద్ర మోదీ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతు ప్రకటించిన పలు కాలనీ సంఘాలకు ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ భవితవ్యం తేల్చే '2024 పోల్స్'- ప్రధాని అభ్యర్థి లేకుండానే బరిలోకి హస్తం పార్టీ- బలాలు, బలహీనతలివే!

"రేవంత్ ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. ఇవాళ అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు. ఆ మధ్యకాలంలో కేసీఆర్​ ఫోన్​ ట్యాపింగ్​ చేసి, రాజకీయ నాయకుల కాల్స్​ను ట్యాపింగ్​ చేశారు. అదే కోవలో ఈనాడు కాంగ్రెస్​ పార్టీ కూడా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్​ హై కమాండ్​ మెప్పు పొందేందుకు, ఫండ్స్ పంపించడానికి ఇక్కడి వ్యాపారస్థులను బెదిరించటం, బ్లాక్‌మెయిల్ చేయటం రేవంత్​ రెడ్డి చేస్తున్నారు. తెలంగాణకు మీరే అన్ని అనుకుంటే పొరపాటు. మీపైనా నిఘా పెట్టిన వారు ఉన్నారు." - ఈటల రాజేందర్​, బీజేపీ నేత

రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్​ రగడ - ఈటల వర్సెస్​ సీఎం రేవంత్​

CM Revanth Fires on Etela Rajender Comments : ఈటల రాజేందర్​ ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్​, చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. కేంద్రంలో వాళ్ల ప్రభుత్వమే (BJP Govt) అధికారంలో ఉన్నందున ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. తమకు ఆలాంటి అవసరం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లు ఏమయ్యారో ప్రజలకు తెలుసన్న సీఎం, వినోద్ కుమార్ ఆఫీస్‌లో రూ.7 కోట్లు దొరికినందుకు ఈటలకు బాధగా ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు.

స్థానికంగా వచ్చిన సమాచారంతోనే పోలీసులు ఆ డబ్బు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్​తో కాదన్న విషయాన్ని ఈటల గుర్తుంచుకోవాలని సూచించారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన తాను, ఇప్పుడు ఎన్నికల నియమావళి రావడంతో ఇవాళ్టి నుంచి పీసీసీ చీఫ్‌గా (PCC Chief Revanth) వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ పని మొదలుపెట్టినట్లు వెల్లడించిన రేవంత్‌ రెడ్డి, పక్కా రాజకీయాలే చేస్తానని ప్రకటించారు.

ప్రభుత్వాన్ని పడగొడతామంటుంటే చూస్తూ ఊరుకోవాలా? - ఇప్పటి నుంచి నా రాజకీయం చూపిస్తా : సీఎం రేవంత్​ రెడ్డి

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ - బీఆర్​ఎస్​ ప్రయత్నాలు విఫలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.