ETV Bharat / politics

లిక్కర్​ స్కామ్​లో రాహుల్ గాంధీకి కేజ్రీవాల్​ అరెస్టు అన్యాయం​ - కవిత అరెస్టు మాత్రం రేవంత్​కు కరెక్టా? : కేటీఆర్​ - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 10:51 PM IST

BRS Leader KTR Participate in Malkajigiri BRS Meeting
BRS Leader KTR Participate in Malkajigiri BRS Meeting

BRS Leader KTR Participate in Malkajigiri BRS Meeting : పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా మల్కాజిగిరి నియోజకవర్గాన్ని గెలుచుకోవాలని బీఆర్​ఎస్​ శాయశక్తులా పోరాడుతోంది. ఈ క్రమంలో అక్కడ బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కాంగ్రెస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

BRS Leader KTR Participate in Malkajigiri BRS Meeting : రాహుల్​ గాంధీ లిక్కర్​ స్కామ్​లో కేజ్రీవాల్​ అరెస్టు అన్యాయమని అంటే రేవంత్​ మాత్రం కవిత అరెస్టు కరెక్టే అంటున్నారని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ దుయ్యబట్టారు. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే బీజేపీలోకి జంప్​ అయ్యే వ్యక్తి సీఎం రేవంత్​నే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల(Lok Sabha Polls 2024) సన్నాహక సమావేశంలో భాగంగా మేడ్చల్​ జిల్లాలోని అలియాబాద్​ చౌరస్తాలో జరిగిన సీఎంఆర్​ కన్వెన్షన్​ హాల్​లో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్​ పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అందరికంటే ముందు బీజేపీలో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంటులో బీఆర్​ఎస్​కు కాంగ్రెస్​తో పోటీ లేదని కేవలం బీఆర్​ఎస్​, బీజేపీ మధ్యనే పోటీ ఉందని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంటు బరిలో కాంగ్రెస్​ డమ్మీ అభ్యర్థిని నిలిపిందని తెలిపారు. అందుకే బీఆర్​ఎస్​కు కచ్చితంగా బీజేపీతోనే పోటీ ఉంటుందని కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఎన్నికల సమయంలో రేవంత్​ రెడ్డి చెప్పినట్లుగానే పాత రోజులు తెస్తానని అన్నారు అందుకు అనుగుణంగానే పంట పొలాల్లో బోర్లు కాలుతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పంట నష్టం భారీగా జరిగిందని కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ(Loan Waiver) జరిగితే కాంగ్రెస్​ ఓటు వేయాలని, డబ్బులు పడని వారు బీఆర్​ఎస్​కు ఓటేయాలని కోరారు.

KTR Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్​ రెడ్డి అధికారంలోకి రాగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పి ఐదు నెలలు గడుస్తున్నా రైతులను పట్టించుకోలేదని కేటీఆర్​ ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో అబద్ధాల కాంగ్రెస్​ను నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. పదేళ్లలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన సంక్షేమం, మంచి పనులు దేశంలోని తెలంగాణను మొదటి స్థానంలో నిలిపాయని కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. ఆ ఘనత కేసీఆర్​కే దక్కుతుందన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో నిజమైన సెక్యులర్​ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీఆర్​ఎస్​నే అని కొనియాడారు. కేసీఆర్​ ఏం చేశారో తాను చెబుతానని ఈటల రాజేందర్​కి దమ్ముంటే మోదీ మల్కాజిగిరికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని సవాల్​ విసిరారు.

"కంటోన్మెంట్​ భూముల విషయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇదంతా చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. మందికి పుట్టిన బిడ్డలను తన బిడ్డలుగా చెప్పుకొనే తత్వం రేవంత్​ రెడ్డిది. రాష్ట్రంలో ముందుగా కాంగ్రెస్​ గెలుస్తుందని రేవంత్​ రెడ్డికి కూడా నమ్మకం లేదు. అదృష్టం కొద్దీ రేవంత్​ సీఎం కుర్చీలో కూర్చున్నారు. బీఆర్​ఎస్​, బీజేపీ ఒకటే అన్న రేవంత్​ రెడ్డి ఇప్పుడు బీజేపీకి మద్దతుగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది." - కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

Lok Sabha Election 2024 : విద్యార్థులకు మతం పేరుతో బీఆర్​ఎస్​ రాజకీయం చేయలేదని బీజేపీపై కేటీఆర్(KTR Fires on Revanth)​ విమర్శనాస్త్రాలు సంధించారు. రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నందుకు ఈటలకు సిగ్గుగా అనిపించలేదా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రూ.16 వేల కోట్లు రైతు రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారు. దీంతో ఏం చూసుకొని బీజేపీ ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. రాహుల్​ గాంధీ చౌకీదారు చోర్​ హై అంటే రేవంత్​ రెడ్డి మాత్రం మోదీ బడే బాయ్​ అంటారని ఎద్దేవా చేశారు. రాహుల్​ గాంధీ లిక్కర్​ స్కామ్​లో కేజ్రీవాల్​ అరెస్టు అన్యాయమని అంటే రేవంత్​ మాత్రం కవితమ్మ అరెస్టు కరెక్టే అంటున్నారని ధ్వజమెత్తారు. సీఎంగా రేవంత్​ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని కేటీఆర్​ కోరారు.

లిక్కర్​ స్కామ్​లో రాహుల్ గాంధీకి కేజ్రీవాల్​ అరెస్టు అన్యాయం​ - కవిత అరెస్టు మాత్రం రేవంత్​కు కరెక్టా? : కేటీఆర్​

కాంగ్రెస్ పార్టీ ఉద్దర మాటలు తప్ప, ఉద్ధరించే పనులు చేయలేదు : హరీశ్​ రావు

'ఫోన్​ ట్యాపింగ్ కేసు​లో నాపై ఆరోపణలు చేసిన వారంతా సారీ చెప్పాల్సిందే - లేదంటే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.